మటన్ దమ్ పక్త్ చాలా స్పెషల్ ముఘులాయ్ రిసిపి. చాలా ఏ కార్యక్రమానికైనా, పార్టీకైనా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వంటను పూర్వకాల పద్దతిలో తయారుచేస్తారు. ముఖ్యంగా చాలా చాలా తక్కువ మంట మీద దీన్ని తయారుచేస్తారు. పాన్ కు అన్ని వైపులా పూర్తిగా సీల్ చేసి మటన్ ఉడికిస్తారు. ఇలా ఆవిరి మీద ఉడికించడం వల్ల మటన్ ముక్కలు చాలా మెత్తగా, మసాలాలన్నింటిని కలగలుపుకొని ఉడికుతుంది కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా కలిగి ఉంటుంది. మటన్ దమ్ పక్త్ సుగంధ మసాలా దినుసులు మరియు హెర్బ్స్ తో తయారు చేస్తారు. ముందుగా మటన్ ను మసాలా పేస్ట్ మరియు పెరుగుతో మ్యారినేట్ చేస్తారు. మ్యారినేట్ చేసిన రెండు గంట తర్వాత ఈ వంటను తయారు చేయడం, చాల తక్కువ మంట మీద ఆవిరిలో ఉడికించడం వల్ల నోరూరించే, రుచికరమైన స్పైసీ వంటకాన్ని మిమ్మల్ని టేప్ట్ చేసేస్తుంది. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే ఎలా తయారుచేయాలో ఒకసారి చూద్దాం..

No comments:
Post a Comment