Saturday, September 28, 2013

గ్యాస్ట్రిక్ సమస్యల 14 సులువైన మార్గాలు


మారుతున్న జీవనశైలి మొట్టమొదట ప్రభావం చూపించేది జీర్ణవ్యవస్థే. అందువల్లనే ఇటీవలి కాలంలో గ్యాస్ట్రిక్ సమస్యల ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎసిడిటి, అల్సర్, గ్యాస్ర్టైటీస్ వంటి సమస్యలు ఎక్కువ మందిలో ఉంటున్నాయి. అతి సాధారణంగా కనిపిస్తూ ఎక్కువ ఇబ్బందులకు గురిచేసేది ఎసిడిటీ లేదా గ్యాస్ర్టైటిస్. ఇవి సాధారణం... పుల్లటి తేన్పులు, వాంతులు , కడుపులో మంట, కడుపు ఉబ్బరంగా ఉండటం ఛాతిలో మంట పట్టేసినట్టు ఉండటం వంటి లక్షణాలు గ్యాస్ర్టైటీస్‌లో చూడ వచ్చు. కొంత మందిలో కొద్దిగా ఆహారం తీసుకున్నా కడుపు నిండినట్టుగా అనిపించడం, లేదా ఆకలి అనిపించక పోవడం ఎటువంటి కారణాలు లేకుండానే బరువు తగ్గిపోవడం వంటివి చూడవచ్చు. ఈ సమస్యలో కడుపునొప్పి నాభి కంటే పై భాగం యందు ఉంటుంది. జీవన శైలిలో మార్పులు అనగా నిద్ర లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం, మసాలాలు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, మానసికమైన ఒత్తిడులు ఇవేకాకుండా మద్యం తీసుకోవడం, పొగాకు వినియోగించే అలవాటు, కొన్ని సార్లు హెచ్. పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. మనం అనుకొంటం కాని మన వంటింటి చిట్కాలు ఒక్కొసారి చాలా అద్బుతంగా పనిచేస్తాయి. నిజంగా అంతే !కడుపు లో గుడగుడ ,మంట గొంతు వరకు ప్రాకుతుంది . ఆంటసిడ్!మెడికల్ స్టొర్! డాక్టర్!ఇంత అవసరమా? కానీ, అసిడిటికి ఇంట్లో అతి సులభంగా దొరికే కొన్నివస్తువలతోనే ఎసిడిటికి చెక్ పెట్టవచ్చు..
అరటిపండు: అరటిపండులో అధికంగా పొటాషియంతో పాటు నేచురల్ ఆంటాసిడ్స్(సహజ ఆమ్లహారం) ఉండి గుండె మంటను నుండి ఉపశమన పొందడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణకోశం శుభ్రపరచడానికి మరియు మలబద్ధకం నివారికి బాగా సహయపడుతుంది.


No comments:

Post a Comment