Saturday, September 28, 2013

మల్టీ ప్లేయర్ గేమ్స్....

ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పనిచేసే అన్ని డివైజ్ లలో ఆడుకోనే లా రూపొందిన గేమ్ డోంట్ ఫాల్ ఇన్ ది హోల్. ఇదో మార్బుల్స్ బేస్డ్ వీడియో గేమ్. ఇది కేవలం మార్బుల్ గేమ్ మాత్రమే కాదు, మీరు ఎప్పుడూ టచ్ చేయని
బాల్ అండ్ రోల్ మేజ్ గేమ్ కూడా. ఒక మార్బుల్ ఫీల్డ్ మీద నాలుగు మూలల నుంచి నలుగురు ఒకేసారి ఈ గేమ్ ని ఆడే అవకాశం వుంది. అంటే ఇది మల్టీ ప్లేయర్ గేమ్ కూడా అన్నమాట. ఈ గేము విధానం మల్టిపుల్ ప్లేయర్స్ మార్బుల్స్ ని టాస్ చేయాల్సి ఉంటుంది. అవి వేరే మార్బుల్స్ కి తగిలి హోల్ లో పడకుండా చూసుకోవాలి. ఈ గేమ్ లో కొన్ని వార్మ్ స్టైల్ మల్టీ ప్లేయర్స్ , ఇంటరెస్టింగ్ పవరప్స్, అన్ కన్వెన్షనల్ స్టేజెస్ ఉంటాయి. కానీ వీటన్నింట్లో గేమ్ ప్రిన్సిపుల్ రూల్ మాత్రం సేమ్. టేబుల్ మీద మల్టీ ప్లేయర్ గేమ్ ఆడటం ఇష్టపడేవారికి డోంట్ ఫాల్ డౌన్ ది హోల్ అనేది బెటర్ ఛాయిస్. ఈ ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ అండ్ స్ట్రాటజీ గేమ్ లో బాంబులు ఫిరంగులలాంటివి. కెనాన్ టు ఎయిమ్, రిలీజ్ టు ఫైర్, ట్యాప్ టు డెటోనేట్ లాంటి ఫీచర్లు ఈ గేములో వున్నాయి. వీటిని మీ అపోనెంట్ ని హోల్ లోకి నెట్టేసేందుకు విచ్చలవిడిగా ఉపయోగించుకోవచ్చు. కానీ జాగ్రత్త. మీ అపెనెంట్స్ కూడా మీ మీద ఎటాక్ చేస్తారు. ఆ టైమ్ లో మీరు జారి హోల్ లో పడిపోయే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా, ఓడుపుగా ఆడాల్సిన గేమ్ ఇది.

No comments:

Post a Comment