Friday, August 9, 2013

కేరళ స్టైల్ బీఫ్ బిర్యానీ : ఈద్ స్పెషల్


పండగ సమయాల్లో చాలా స్పెషల్ గా వంటలు వండుకోవాలని అందుకు ముందు నుండే ప్రిపేర్ అవుతుంటారు. ముఖ్యంగా సంవత్సరానికి ఒక సారి వచ్చే రంజాన్ ను ముస్లీంలు చాలా స్పెషల్ గా,
అత్యంత భక్తి శ్రద్దలు, ఉపవాసాలను రంజాన్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. వీరి పండుగలకు ముఖ్యంగా మాంసాహార వంటలు ప్రత్యేకంగా వండుకుంటారు. మాంసాహార వంటల్లోనే వివిధ వెరైటీలను వండి అథితులతకు ఆతిద్యం ఇస్తుంటారు. ముఖ్యంగా మాంసాహార వంటల్లో బిర్యానీకి ఎక్కువగా ప్రాధన్యం ఇస్తారు. బిర్యానీ కూడా వివిధ రకాలుగా తయారు చేస్తారు. ఉదా: చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ. ఇలా వేటికవే ఫేమస్. మరి ఈ రోజు ఈద్ స్పెషల్ గా మన తెలుగు వారికి కేరళ స్టైల్లో బిర్యానీ ఎలా తయారు చేయాలో బోల్డ్ స్కై ప్రత్యేకంగా అంధిస్తోంది. మరి దీని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం.... 

కావల్సిన పదార్థాలు: 
బీఫ్: 1kg 
ఉల్లిపాయ పేస్ట్: 4tbsp 
బాదం పేస్ట్: 1tbsp
 పెరుగు: ½ cup
 పుదీనా ఆకులు: 1 మొలక (చిన్న ముక్కలుగా తరిగాలి) 
కొబ్బరి పాలు: ½cup 
ధనియాల పొడి: 1tsp 
పసుపు: 1tsp పెప్పర్ 
పౌడర్: 1tsp 
గరం మసాలా: 1tsp 
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tbsp 
ఉప్పు: రుచికి సరిపడా 
నూనె: 3tbsp 
నీళ్ళు: 2 cups 
అన్నం కోసం : బాస్మతి బియ్యం: 2cups
 యాలకులు: 4 
లవంగాలు : 4 
దాల్చిన చెక్క: 2 
ఉప్పు: రుచికి సరిపడా
 నెయ్యి: 2tbsp
 నీళ్ళు: 4cups

తయారుచేయు విధానం:
 1. ముందుగా బియ్యాన్ని నీటిలో వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. 2. తర్వాత బీఫ్(గొడ్డుమాంసం)ముక్కలను బాగా శుభ్రంగా కడిగి, పెరుగు, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి, బీఫ్ ముక్కలకు బాగా పట్టించి, రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 3. 2గంటల తర్వాత, పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి 56నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. అలాగే అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి. 4. తర్వాత అందులోనే బాదాం పేస్ట్, ధనియాల పొడి, పెప్పర్ పొడి, గరం మసాలా, వేసి ఒక నిముషం వేగించిన తర్వాతా కొబ్బరి పాలు పోసి మరో మూడు నిముషాలు ఉడికించుకోవాలి. 5. ఇప్పుడు వేగుతున్న మిశ్రమంలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్ని బీఫ్ ముక్కలు మరియు పుదీనా ఆకులు వేసి బాగా మిక్స్ చేసి 15-20నిముషాల పాటు మీడియం మంట మీద బాగా ఉడికించుకోవాలి. 6. మటన్ ముక్కలు ఉడుకుతున్నప్పుడు ఉప్పు, మరికొద్దిగా నీళ్ళు కూడా పోసి, 45నిముషాలు మీడియం మంట మీదు ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి. మటన్ ముక్కలు బాగా ఉడికిందని నిర్ధారించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలిజ. 7. తర్వాత నీళ్ళలో బియ్యం వేసి శుభ్రంగా కడిగాలి. 8. ఇప్పుడు ఒక డీప్ బాటమ్ పాత్రలో నీళ్ళు పోసి లవంగాలు, చెక్క, యాలకలు వేసి నీళ్ళు మరుగుతుండగా కడిగి పెట్టుకొన్న బియ్యంను అందులో వేసి కొద్దిగా ఉప్పు చేర్చి, మూత పెట్టి, మీడియం మంట మీద 15నిముషాలు వేగించుకోవాలి. 9. అన్నం ఉడికిందని నిర్ధారించుకొన్నాక, స్టౌ ఆఫ్ చేసి, అన్నంను ఒక వెడల్పాటి ప్లేట్ లోనికి తీసి అన్నం చల్లారనివ్వాలి. 10. ఇప్పుడు మరో డీప్ బాటమ్ పాన్ తీసుకొని, అందులో నెయ్యి వేసి, వేడయ్యాకు అందులో జీడిపప్పు, ద్రాక్ష వేసి మరో నిముషం వేగించుకోవాలి. 11. ఇప్పుడు అందులో ప్లేట్ లో తీసి పెట్టుకొన్ని అన్నంను సగాన్ని అందులో డీప్ బాటమ్ పాన్ లో సర్దాలి. దాని మీద బ్రౌన్ గా వేగించుకొన్న ఉల్లిపాయ ముక్కలను లేయర్ గా సర్దాలి. దీని మీద ముందుగా తయారు చేసి పెట్టుకొన్ని బీఫ్ మసాల, బీఫ్ ముక్కలతో సహా వేసి సర్ధాలి. ఇలా మరో సారి అన్నం, ఉల్లపాయలు, బీఫ్ గ్రేవీని లేయర్ లేయర్స్ గా సర్ధుకోవాలి. 12. చివరగా డీప్ బాటమ్ పాన్ కుక్కర్ మూత పెట్టి, తక్కువ మంట మీద ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. 13. ఒకసారి ఉడికిందని నిర్ధారించుకొని, స్టౌవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్నంతా లైట్ గా మిక్స్ చేసుకొని, వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే కేరళ స్టైల్ బీఫ్ బిర్యానీ రెడీ టు సర్వ్. ఈ రిసిపిని ఈరోజు ఈద్ స్పెషల్ గా అథితులకు ట్రీట్ ఇవ్వండి..

No comments:

Post a Comment