Tuesday, August 13, 2013

చికెన్ అండ్ పీస్(పచ్చిబఠానీ)రైస్ రిసిపి


చికెన్ రైస్ చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఈ చికెన్ రైస్ ను ఎటువంటి గ్రేవీ, సలాడ్ లేదా రైతాతో అయినా తినవచ్చు. చికెన్ అండ్ పీస్ రైస్ రిసిపిని తయారు చేయడం చాలా సులభం. అంతే కాదు దీన్ని భోజనం లేదా డిన్నర్ తో ఏ సమయానికైనా బాగా నప్పుతుంది. చికెన్ అండ్ పీస్ రైస్ రిసిపి, చాలా సులభంగా అరగంటలో తయారు చేసేయవచ్చు. ఈ వంటకు ముఖ్యంగా చికెన్ తొడలు మరియు చికెన్ లెగ్స్, పచ్చిబఠానీలతో తయారు చేస్తారు. ఈ వంటకం కరేబియన్ కుషన్స్ చాలా ప్రసిద్ది చెందిన వంటకం. ఈ వంటకానికి సుగంధ మసాలా దినుసులు మరియు ఫ్లేవర్స్ తో తయారు చేయడం వల్ల ఇంతటి రుచిని అందిస్తుంది. మరి మీరు ఈ చికెన్ అండ్ పీస్ పీస్ పులావ్ టేస్ట్ చూడాలంటే ఒక సారి ట్రైచేసి చూడండి.. 

కావల్సినపదార్థాలు: 
చికెన్ తైస్(స్కిన్ తీసేసిన చికెన్ తొడలు): 3-4 
పచ్చి బటానీలు:1cup 
బియ్యపు: 1 ½cup
 వెల్లుల్లి: 3రెబ్బలు(తురుముకోవాలి) 
లెమన్ జెస్ట్: 1(తురుము) 
నల్ల మిరియాలు పొడి: ½tsp 
చికెన్ ఉడకబెట్టిన
 పులుసు: 2 cups 
తాజా వాముపువ్వు: 2 కొమ్మలు 
ఆలివ్ ఆయిల్: 1tbsp
 నీళ్ళు: 1cup 
ఉప్పు: రుచికి సరిపడా


తయారు చేయు విధానం: 1. ముందుగా చికెన్ ముక్కలను(చికెన్ తొడలను)బాగా శుభ్రం చేసి, వాటికి ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ బాగా మిక్స్ చేసి చికెన్ ముక్కలకు మ్యారినేట్(అప్లై చేసి)పక్కన పెట్టుకోవాలి. 2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి బాగా కాగనివ్వాలి. తర్వాత అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్ని చికెన్ ముక్కలు వేసి, పది నిముషాలు వేగించుకోవాలి. చికెన్ ముక్కలు అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ డీప్ ఫ్రై చేసుకోవాలి. 3. తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బల తురుము వాముపువ్వు(thyme)వేసి బాగా వేగించాలి. ఒక నిముషం తర్వాత లెమన్ జస్ట్ మరియు శుభ్రంచేసి కడిగి పెట్టుకొన్న బియ్యం వేసి బాగా మిక్స్ చేయాలి. 4. తర్వాత అందులో చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు అందులో పోయాలి. వేగించుకొన్ని రైస్ మిశ్రమాన్ని చికెన్ సూప్ తో బాగా మిక్స్ అయ్యే కలియబెట్టి తర్వాత మూత పెట్టాలి. 40-45 నిముషాలు సిమ్మ్ లో పెట్టాలి. 5. అంతలోపు పచ్చిబఠానీలను వేడి నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉడుకుతున్న రైస్ మీద మూత తీసి బియ్యం ఉడికిందోలేదో ఒక సారి చేక్ చేసి తర్వాత వేడినీటిలో నానబెట్టుకొన్ని పచ్చిబఠానీలను వేసి మరో 3-4నిముషాలు ఉడికించుకోవాలి. అంతే చికెన్ అండ్ పీస్(పచ్చిబఠానీ)రైస్ రిసిపి రెడీ..


No comments:

Post a Comment