Wednesday, August 14, 2013

జలాంతర్గామిలో భారీ అగ్నిప్రమాదం

ముంబై : నగరంలోని నేవీ రేవులో ఉన్న ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న జలాంతర్గామి
సముద్రంలో మునిగిపోయింది. ఈ సమయంలో జలాంతర్గామిలో ముగ్గురు అధికారులతోపాటు మొత్తం 18 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి... బుధవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో భారీ విస్పోటనం సంభవించింది. ఈ ఘటనతో మంటలు నలువైపులా వ్యాపించాయి. ప్రమాద సమయంలో జలాంతర్గామిలో ఉన్న 18 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వీరిని కాపాడేందుకు రక్షక దళాలు చర్యలు ప్రారంభించారు. ప్రమాద విషయం తెలుసుకున్న 12 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చాయి. డోక్ యార్డులో పేలుడు పదార్థాలు ఉండడం వల్లే ఈ ఘటన జరిగినట్లు నేవీ అధికారులు భావిస్తున్నారు. పేలుడు పదార్థాలు జలాంతర్గామిలోకి ఎలా వచ్చాయి..? ఎవరు తీసుకొచ్చారు..? అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment