Tuesday, August 13, 2013

సౌందర్యం పెంచడంలో శెనగపిండి గొప్పదనం.!


సున్ని పిండి, పెసరపిండి, శెనగపిండి ఇవి మన ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి సౌందర్య సాధానాలు. వీటిని, వేల సంవత్సరాల నుండి సౌందర్య ఉత్పత్తిగా ఉపయోగిస్తున్నార. సున్నిపిండి శరీరానికి మర్ద చేసిన స్నానం చేసేవారు. అలాగే శెనగపిండి కూడా చాలా విరవిగా ఉపయోగిస్తారు. శెనగిపిండితో ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటారు. ఈ సాంప్రదాయకరమైన శెనగపిండిని ఒక్క చర్మ సంరక్షణలోనే కాదు, కేశ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. కేశాలకు శెనగిపిండి ఉపయోగించడం వల్ల చుండ్రు వదలడంతో పాటు, ఇతర జుట్టు సమస్యలు కూడా వదులుతాయి. ఇక చర్మ సంరక్షణలో శెనగిపిండి ఒకగొప్ప ఔషదం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది మొటిమలు, దానికి తాలుకూ మచ్చలు, చారలు, నల్ల మచ్చలు, స్కిన్ ప్యాచ్ వంటి వాటిన్నింటిని చాలా సులభంగా తొలగిస్తుంది. ఖరీదైన రసాయనిక ఉత్పత్తులను పక్కన పెట్టి, శెనగపిండి ఉపయోగించి, అనేక బ్యూటీ ప్రయోజనాలను పొందడానికి ఇది ఒక చక్కటి అవకాశం. పెసరపిండి కానీ, లేదా శెనగపిండి కానీ, లేదా సున్నిపిండికానీ ఏదైనా సరే ఉపయోగించినప్పుడు మంచి ఫలితాలను పొందవచ్చు. పెసర పిండి, చర్మ సంరక్షణకు ఒక బెస్ట్ ప్రొడక్ట్ గా ఉపయోగించవచ్చు. శెనగిపిండిని బాడీ స్ర్కబ్ గా సాధారణంగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో మన భారతీయ మహిళలు ఎక్కువగా హెర్బల్ రెమడీస్ ను ఉపయోగించడానికి శ్రద్ద చూపిస్తున్నారు. వీటితో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక వీటి మీద ఎక్కువ మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. మరో ప్రయోజనం ఈ నేచురల్ హెర్బల్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువగా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. మరియు దీర్ఘకాలం కొనాల్సిన పనిలేదు. ఇవి సహజంగానే ఎల్లప్పుడు మన వంటగదిలో నిత్యవసర వస్తువులుగా ఉంటాయి. కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి శెనగపిండిని ఎలా ఉపయోగించాలి. దాని ప్రయోజనాలేంటో క్రింది విధంగా ఉన్నాయి. పరిశీలించండి..
               సన్ టాన్: వేసవిలో, సెలవుల్లో, చర్మం ఎక్కువగా సన్ టాన్ కు గురిఅవుతుంటుంది. మరి సన్ టాన్ నుండి ఆరోగ్యకరంగా బయటపడాలంటే 3చెంచాలా శెనపిండి, చిటికెడు, టమోటో జ్యూస్, అర చెంచా పెరుగు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్ టాన్ కు గురియైన ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

No comments:

Post a Comment