Saturday, August 17, 2013

థాయ్ కోకోనట్ రైస్ రిసిపి-స్పెషల్ టేస్ట్

థాయ్ ఫుడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే మన ఇండియాలో అంత పాపులర్ అయ్యాయి. ఈ వంటలు చాలా స్పైసీగా మరియు గొప్ప రుచిని కలిగి ఉంటాయి . సాధారణంగా థాయ్ ఫుడ్స్ కు చాలా సింపుల్ వస్తువులను మరియు హెర్బ్స్ ను ఉపయోగిస్తుంటారు. అందుకు చాలా టేస్టీగా ఉంటాయి. అటువంటి టేస్ట్ ఆహారాల్లో ఈ థాయ్ కోకోనట్ రైస్ ఒకటి. ఈ వెరైటీ థాయ్ కోకోనట్ రైస్ కు వెరైటీగా ఇండియన్ కర్రీస్స్ తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కోకోనట్ రిసిపికి ముఖ్యంగా కావల్సింది కొబ్బరి పాలు. కొబ్బరి పాలు ఉపయోగించడం వల్ల అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అలాగే జాస్మిన్ రైస్ లేదా బాస్మతి రైస్ మరింత టేస్ట్ ను జోడిస్తాయి. ఈ రిసిపిని ప్రిపేర్ చేయడానికి ఏం అంత కష్టపడాల్సిన పనిలేదు . డిన్నర్ కు ఫర్ ఫెక్ట్ రిసిపి మరి ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.. 

కావల్సిన పదార్థాలు:
జాస్మిన్ సెంట్ రైస్ లేదా బాస్మతి రైస్: 2cups
కొబ్బరి పాలు: 1cup
కొబ్బరి తురుము: 1/2cup
పంచదార: 1tsp
నిమ్మ ఆకులు:1 లేదా 2
ఉప్పు: చిటికెడు 
నీళ్ళు: 2cups

తయారు చేయు విధానం: 
1. ముందుగా నీళ్ళలో బియ్యం వేసి శుభ్రం కడిగి పక్కన పెట్టుకోవాలి. 2. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె రాసి తర్వాత అందులో కొబ్బరి పాలు, నీళ్ళు, నిమ్మ ఆకులు మరియు ఉప్పు వేయాలి. 3. తర్వాత ఇప్పుడు ఈ పాన్ ను స్టౌ మీద పెట్టి, వేడి చేయాలి. మీడియం మంట మీద బాగా ఉడికించుకోవాలి. 4. 5-10నిముషాల తర్వాత, ముందుగా కడిగి పెట్టుకొన్న బియ్యాన్ని అందులో వేసి, బాగా మిక్స్ చేయాలి. 5. తర్వాత మంటను మీడియంకు తగ్గించి, పాన్ కు మూత పెట్టాలి. 6. మంట తగ్గించిన తర్వాత మరో 15నిముషాలు సిమ్ లో పెట్టాలి. 7. పదిహేను నిముషాల తర్వాత, మూత తీసి, అందులో కొబ్బరి తురుమును వేయాలి. 8. స్పూన్ సహాయంతో నిమ్మ ఆకులను బయటకు తీసేయాలి. 9. అంతే స్టౌ ఆఫ్ చేసి, ఈ కోకోనట్ రైస్ కు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే థాయ్ కోకోనట్ రైస్ రెడీ. దీన్ని మీకు నచ్చిన ఏదైన కర్రీతో సర్వ్ చేయవచ్చు.

No comments:

Post a Comment