Sunday, August 18, 2013

థాయ్ చికెన్ గ్రీన్‌కర్రీ-స్పైసీ అండ్ టేస్టీ

థాయ్ ఫుడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే మన ఇండియాలో అంత పాపులర్ అయ్యాయి. ఈ వంటలు చాలా స్పైసీగా మరియు గొప్ప రుచిని కలిగి ఉంటాయి . సాధారణంగా థాయ్ ఫుడ్స్ కు చాలా సింపుల్ వస్తువులను మరియు హెర్బ్స్ ను ఉపయోగిస్తుంటారు. అందుకు చాలా టేస్టీగా ఉంటాయి. అటువంటి టేస్ట్ ఆహారాల్లో ఈ థాయ్ చికెన్ గ్రీన్ కర్రీ ఒకటి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, వాళ్లకు రంగులు మాత్రమే కాదు. రుచికరమైన కూరలు. రుచి మాత్రమే కాదు. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న కూరలు. ఈ తరహా కూరలకు థాయ్‌లాండ్ ప్రసిద్ధి. వీటిని చేయటానికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ల కూరల్లో వెజ్, నాన్‌వెజ్ రెండూ ఉన్నాయి.
కావలసిన పదార్థాలు : 
చికెన్ : 150grm, 
కొబ్బరిపాల పొడి: 50grm
 గ్రీన్‌కర్రీ పేస్ట్ : 30grm
తులసి ఆకులు : కొన్ని
 నిమ్మ ఆకులు : కొన్ని
 వెదుర్లు : 4grm
 ఫిష్ సాస్ : 2grm
 నువ్వుల నూనె : ఒకస్పూన్
 ఉప్పు : తగినంత 
అల్లం : 5grm 
నూనె : 2tsp
 కార్న్‌ఫ్లోర్ : 500grm 
అజినామోటో : 5grm
తయారుచేయు విధానం : 1. ముందుగా వేడి నీటిని తీసుకుని అందులో కొబ్బరి పాల పొడిని వేసి కొబ్బరిపాలు తయారు చేసుకోవాలి. 2. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్, వెదుర్లు వేసి ఫ్రై చేసుకోవాలి. 3. తరువాత గ్రీన్ కర్రీ పేస్ట్, నిమ్మఆకులను వేసుకోవాలి. 4. తర్వాత కొబ్బరి పాలు కూడా పోసి బాగా కలుపుకోవాలి. 5. ఇప్పుడు ఫిష్ సాస్, నువ్వుల నూనె వేసి మరికాసేపు ఫ్రై చేసుకోవాలి. 6. చివరగా తులసి ఆకులతో గార్నిష్ చేసుకోవాలి.

No comments:

Post a Comment