డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (డిఆర్డిఓ) సంస్థ తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లో అమ్ముతుంది. దీంతో మన ల్యాబ్ లో రూపొందిన ఆధునిక డిటెక్టర్లు అమెరికా భద్రతా బలగాల చేతుల్లో ఉన్నాయి. ఇప్పటి దాకా ఆయుధాల
దిగుమతిలో నెంబర్ వన్ గా ఉన్న భారత్ ఇప్పుడు ఎగుమతి చేస్తుంది.
అమెరికాకు ఎగుమతి
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెలవప్‌మెంట్ - డిఆర్‌డిఓ ఆధునిక ఆయుధాలు రూపొందించడంలో ముందుంటుంది. అగ్ని మిస్సైల్స్ వంటి అద్భుతాలు సృష్టించిన ఈ పరిశోధన సంస్థ తయారు చేసిన బాంబ్ డిటెక్టర్ అమెరికాకు ఎగుమతి అవుతోంది. ఆయుధాల కోసం అమెరికాకు ప్రతి ఏటా భారత్ వేలకోట్ల డాలర్లు ధారబోస్తుంది. ఇప్పుడు అమెరికాకే బాంబ్ డిటెక్టర్‌లు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరింది. చిన్న వస్తువే అయినా అమెరికన్ల ప్రాణాలు కాపాడటంతో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
పూనె ల్యాబ్‌లో తయారైన డిటెక్టర్
పూనె ల్యాబ్‌లో తయారైన చిన్న బాంబ్ డిటెక్టర్‌ను డిఆర్‌డిఒ... అమెరికాకు చెందిన ఓ కంపెనీకి అమ్మింది. చిన్న సూట్‌కేస్‌లో సరిపోయే ఈ పరికరం తక్కువ సమయంలో పేలుడు పదార్ధాలను గుర్తిస్తుంది.టిఎన్‌టి. ఆర్డీఎక్స్ వంటి ప్రమాదకర పేలుడు పదార్ధాలను గుర్తించడంలో ఇది వేగంగా పనిచేస్తుంది. సాంకేతికంగా శిక్షణ లేని వారు కూడా దీనిని ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు. చిన్న కెమికల్ పరీక్షలతో పేలుడు పదార్ధాల తీవ్రత... వాటి సహజలక్షణాలను గుర్తించవచ్చంటున్నారు. చాలాకాలం తర్వాత ఇది భారత్ సాధించిన విజయంగా డిఆర్‌డిఒ భావిస్తుంది. భారత రక్షణ రంగంలో పరిశోధనలకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. అయితే అద్భుతాలు సృష్టిస్తూ ముందుకు సాగుతున్న డిఆర్‌డిఓను ప్రోత్సహించాల్సిన పాలకులు... ఎఫ్‌డిఐల పేరుతో సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రక్షణ రంగంలో దేశీయ పరిశోధనలకు నష్టం కలిగించేలా... విదేశీయులకు ఆహ్వానం పలుకుతున్నారు.

No comments:
Post a Comment