Sunday, August 11, 2013

మూంగ్ దాల్ ఖడీ - శ్రావణ మాసం స్పెషల్

ఖడీ ఒక ఫేవరెట్ నార్త్ ఇండియన్ రిసిపి. ఇది వెజిటేరియన్స్ ఒక మంచి ఎంపిక. ఇటువంటి స్పెషల్ రిసిపిలో శ్రావణ మాసంలో అధికంగా తయారు చేస్తుంటారు. వీటిని ప్రత్యేకంగా చేయడం,
ముఖ్యంగా ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకుండాలనే తయారు చేసే సాంప్రదాయం చాలా మందిలో ఉంది. మరి అటువంటి నోరూరించే రిసిపి మీకోసం ఒక్కడ అంధిస్తున్నాం. ఖడీని సాధారణంగా శెనగపిండి మరియు పెసరపిండితో తయారు చేస్తారు. శెనగపిండితో తయారు చేసిన ఉండలను పెరుగు, పెసరపిండి మిశ్రమ గ్రేవీలో వేసి ఉడికించడంలో ఓ ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. మరి ఈ శ్రావణ మాసం రిసిపిని ఎలా తయారు చేస్తారు.

మూంగ్ దాల్: 
1 ½cup 
పెరుగు: 2 cups 
హింగ్ (ఇంగువ): ఒక చిటికెడు 
జీలకర్ర: 1tsp
 మెంతులు: 1tsp 
పసుపు: ½tsp 
పచ్చిమిరపకాయలు: 2(చిన్న ముక్కలుగా కత్తిరించి) 
ఉప్పు: రుచి ప్రకారం 
కొత్తిమీర: 2tbsp(చిన్న ముక్కలుగా కత్తిరించి) 
ఆయిల్: 1tbsp 
ఆయిల్: వేయించడం కోసం 
నీరు: 2cups

తయారుచేయు విధానం: 1. మూడు గంటల పాటు పెసరపప్పును 3గంటలపాటు నానబెట్టుకోవాలి . తర్వాత నీరు వంపేసి, మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. 2. గ్రైండ్ చేసుకొన్న పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసి, సగభాగం పక్కన పెట్టుకోవాలి. 3. తర్వాత ఇక మిగిలిన సగ భాగంలో ఉప్పు, పచ్చిమిర్చి మరియు ఒక టేబు స్పూన్ కొత్తిమీర తరుగు వేసి, బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో నుండి కొద్దిగా కొద్దిగా తీసుకొన చిన్న చిన్న బాల్స్ లా చుట్టుకోవాలి. 4. తర్వాత డీప్ ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడి చేసి, బాల్స్ లా చుట్టుకొన్న మూంగ్ దాల్ బాల్స్ ను నూనెలో వేసి, మీడియం మంట మీద గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ పక్కన పెట్టుకోవాలి. 5. తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకొన్న పకోడాలను పేపర్ టవల్ మీద, ఎక్సెస్ ఆయిల్ ఇంకిపోయేలా పెట్టాలి. 6. మరో పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, వేడియ్యాక అందులో జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి మరో నిముషం వేగించుకోవాలి. 7. తర్వాత అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేసి, అందులో ముందు పక్కన పెట్టుకొన్న సగభాగం పెసరప్పు పేస్ట్, మరియు రెండు కప్పుల నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి పాన్ లో పోయాలి. 8. ఈ మిశ్రమాన్ని బాగా ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడే, పసుపు మరియు ఉప్పు కూడా వేసి ఉడికించాలి. మీడియం మంట మీద 15-20నిముషాల పాటు ఉడికించుకోవాలి. 9. 20నిముషాల తర్వాత బాగా కలియట్టి మంట తగ్గించుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న మూంగ్ దాల్ బాల్స్ ను వేసి, మరో పది నిముషాలు ఉడికించుకోవాలి. ఒక సారి ఉడికించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే మూంగ్ దాల్ ఖడి రెడీ. ఇది అన్నంకు చాలా ఫర్ ఫెక్ట్ సైడ్ డిష్.

No comments:

Post a Comment