Sunday, August 11, 2013

పెద్దన్నను వణికిస్తున్న 18 స్ట్రీట్ గ్యాంగ్

అమెరికా : గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలు, ఆయుధాల సరఫరా, హత్యలు, నేరాలు ఇటువంటి అసాంఘిక నేరాలకు ప్రసిద్ధి అమెరికాలోని 18 స్ట్రీట్ గ్యాంగ్. ఇపుడు ఈ గ్యాంగ్
అమెరికా ఆధిపత్యాన్నే సవాలు చేయడమే కాదు, ప్రపంచ దేశాలలో కూడా తన ఉనికిని చాటుకుంటూ నేరాల సామ్రాజాన్యి విస్తరించుకుంటోంది. ఈ గ్యాంగ్ లో పనిచేస్తున్న వారంతా 30 ఏళ్ళ లోపువారే. ప్రపంచానికి క్రిమినల్స్ ఇక్కడినుంచే సరఫరా అవుతున్నారు. ఆ గ్యాంగ్ పేరు వింటేనే చాలు అమెరికా గుండెలు దడదడలాడుతాయి. ఈ గ్యాంగ్ పేరు చెబితే చాలు ప్రపంచ దేశాలు గడగడలాడతాయి. అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పటికే కొన్ని దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న అమెరికాను ఈ గ్యాంగ్ అల్లాడిస్తోంది. కాదు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ గ్యాంగులోకి ఎవరైనా సభ్యులుగా చేరాలనుకుంటే ముందుగా ఆ గ్యాంగులోని ఐదుగురు సభ్యులు కొత్తగా చేరాలనుకున్న వ్యక్తిని కుమ్మేస్తారు. 18 అంకెలు లెక్కపెట్టేవరకు ఆ వ్యక్తిని వారు చితకబాదుతూనే వుంటారు. ఎందుకంటే ఎవరైతే దెబ్బలను తట్టుకొని నిలబడతారో వారికే గ్యాంగులో సభ్యునిగా స్థానమిస్తారు. ఇది ఆ గ్యాంగ్ రూల్. ఆ తరువాత తమ పరీక్షకు నిలబడిన సభ్యుణ్ణి ఒంటినిండా ట్యాటూలతో ఐడెంటిఫై చేస్తారు. అంటే అతని ఒంటిపై వారి గ్యాంగ్ కోడ్ ను ట్యాటూస్ గా ముద్రిస్తారు. గ్యాంగులో చేరిన వారికి బయటి సంబంధాలు ఉండవు, ఉండకూడదు. గ్యాంగు సభ్యులే రక్తసంబంధీకులు. వారి జీవితమంతా ఆ గ్యాంగు కోసం పనిచేయడమే. బ్యాంకులో దొంగతనాలు, వ్యక్తుల దోపిడీలు, వ్యక్తులను హత్య చేయడం, ఇటువంటి అఘాయిత్యాలకు వీరు పాల్పడుతుంటారు. ఒకవేళ పట్టుబడితే జైలులో కూడా వీరు ఖాళీగా వుండరు. అక్కడ గ్యాంగుల మధ్యలో సమావేశాలు జరిగినపుడు మరింత మొరటుగా, కర్కోటకులుగా మారిపోతారు.బయటికి వచ్చాక అంతకు ముందుకంటే కూడా ఎక్కువ మోతాదులో హింసాత్మక సంఘటనలకు దిగుతారు. వీరికి ఈ గ్యాంగ్ ను నడపడానికి ఆదాయం గంజాయి, మాదకద్రవ్యాలు, ఆయుధాల సరఫరా ద్వారా వస్తుంది. వీటిని ఒక నిధిగా ఏర్పర్చి వారికోసం వాడుకునేలా చూసుకుంటారు. దానికి ఈ గ్యాంగులో రూల్స్, రెగ్యులేషన్లు వుంటాయి. ఇక జైలు కెళితే అక్కడ రాజభోగాలు వీరికి దొరుకుతాయి. అసలు మనదేశంలో జైలుకు వెళ్ళడమంటే ఒక నరకం. కానీ వీరికి జైలు అంటే స్వర్గ సుఖాల దేవేంద్ర వైభోగం. ఎక్కువగా ఈ గ్యాంగులో 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య యువకులు, యువతులు సభ్యులుగా ఉంటారు.ఈ గ్యాంగులో ఎవరూ కూడా 30 దాటిన వయసును అనుభవించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు.  

No comments:

Post a Comment