Saturday, December 26, 2015

గ‌ర్భిణీ స్ర్తీలు కొబ్బ‌రినీళ్లతో పొందే ప్ర‌యోజ‌నాలు

త‌ల్లి కావ‌డం అనేది ప్ర‌తి మ‌హిళ‌కి చాలా ఆనంద‌క‌ర‌మైన విష‌యం. అదో అద్భుతమైన అనుభూతి. గ‌ర్బందాల్చిన త‌ర్వాత చాలా జాగ్ర‌త్త‌గా.. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ తీసుకోవాలి. ఆహారం విష‌యంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. కావాల్సిన
పోష‌కాహారం తీసుకోవ‌డానికి ప్ర‌తి గ‌ర్భిణీ మ‌హిళా ప్ర‌య‌త్నిస్తుంది. క‌డుపులోని బిడ్డ‌కు, త‌ల్లికి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర్చే ఆహారాలెన్నో ఉన్నాయి. ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో.. కొబ్బ‌రినీళ్లు తీసుకోవ‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో కొబ్బ‌రినీళ్లు తీసుకోవ‌డం వ‌ల్ల నిత్యం శ‌రీరానికి కావాల్సిన ఫ్లూయిడ్స్ అందుతాయి. అలాగే గ‌ర్భధార‌ణ స‌మ‌యంలో శ‌రీరానికి అవ‌స‌రమైన ఎల‌క్ర్టోలైట్స్ కూడా కొబ్బ‌రినీళ్ల ద్వారా పొంద‌వ‌చ్చు. ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో.. శ‌రీరం హైడ్రేట్‌గా ఉంటుంది. గ‌ర్బిణీ మ‌హిళ‌లు నిత్యం కొబ్బ‌రినీళ్లు తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. కొబ్బ‌రినీళ్లు తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో గ‌ర్బిణీ మ‌హిళ‌తోపాటు, క‌డుపులో బిడ్డ‌కు పొందే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలేంటో ఇప్పుడు చూద్దాం.. ఫ్లూయిడ్: గ‌ర్బిణీల శ‌రీరానికి ఫ్లూయిడ్స్ చాలా ఎక్కువ మోతాదులో అవ‌స‌రం. అలాగే గ‌ర్భ‌స్థ‌శిశువు ఆరోగ్యానికి కూడా ఫ్లూయిడ్స్ ఎక్కువ‌గా తీసుకోవాలి. కొబ్బ‌రినీళ్లు తీసుకోవ‌డం వ‌ల్ల ఫ్లూయిడ్స్ స్థాయి పెంచ‌డంలో తోడ్ప‌డ‌తాయి. అలాగే శ‌రీరంలో బ్ల‌డ్ పెర‌గ‌డానికి కూడా ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. ఎల‌క్ర్టోలైట్స్: ప్రెగ్నెంట్ ఉమెన్‌కి ఎల‌క్ర్టోలైట్స్ చాలా అవ‌స‌రం. శ‌రీరం హైడ్రేటెడ్‌గా ఉండ‌టానికి కొబ్బ‌రినీళ్లు స‌హాయ‌ప‌డ‌తాయి. కొబ్బ‌రినీళ్ల‌లో ఉండే సోడియం, క్యాల్షియం, పొటాషియం శ‌రీరానికి ఎన‌ర్జీని అందిస్తాయి. హైప‌ర్ టెన్ష‌న్ త‌గ్గిస్తాయి: చాలామంది మ‌హిళ‌లు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో హైప‌ర్ టెన్ష‌న్ తో బాధ‌ప‌డుతుంటారు. దీనివ‌ల్ల అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. త‌ల్లికి, బిడ్డ‌కు ఇద్ద‌రికీ ప్ర‌మాద‌మే. కొబ్బ‌రినీళ్లు తీసుకోవ‌డం వ‌ల్ల చాలా రిలాక్స్ గా, టెన్ష‌న్ త‌గ్గించ‌డానికీ స‌హాయ‌డ‌ప‌తాయి. అలాగే బీపీని కంట్రోల్ చేయ‌డానికి సహ‌క‌రిస్తాయి. హెల్తీ వెయిట్: కొబ్బ‌రినీళ్ల‌లో జీరో ఫ్యాట్స్, కొలెస్ర్టాల్ త‌క్కువ‌గా ఉంటాయి. బ‌రువు పెర‌గ‌కుండా కంట్రోల్ లో ఉండ‌టానికి ఇది స‌హాయ‌ప‌డుతుంది. కాబ‌ట్టి రోజూ కొబ్బ‌రినీళ్లు తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్బ‌ధార‌ణ స‌మ‌యంలో బ‌రువుని అదుపులో ఉంచ‌డానికి స‌హ‌క‌రిస్తాయి..

No comments:

Post a Comment