Tuesday, December 15, 2015

గర్భిణీ స్త్రీలకు అలర్జీ నుండి ఉపశమనం ...

అలర్జీల బారీన పడుతుంటారు. వాతావరణంలో వచ్చే మార్పులతో కొంత మంది అలర్జీలకు గురైతే, మరికొందరు, ఆహారాలు, పానీయాలు, పువ్వుల వల్ల అలర్జీకి కారకులవుతుంటారు. ఇక ఇల్లల్లో డస్ట్, గార్డెన్ లోని పాలెన్స్, పొల్యూషన్, నట్స్, వంటివన్నీ కూడా అలర్జీలకు కారణమే . ముఖ్యంగా గర్భణీ స్గ్రీలు ఇటువంటి పరిస్థితిలో
శారీరకంగా మరియు మానసికంగా అనేక మార్పులను ఎదుర్కొంటుంటారు . శరీరంలో మార్పులే కాకుండా, బాడీ పెయిన్ కూడా సహజమే. అయితే, ప్రస్తుతం ఉన్న మార్పులకు, బాడీపెయిన్స్ కు తోడు అలర్జీలు తోడైతే ఇక పరిస్థితి ఏంటిం? ముఖ్యంగా గర్భావస్థ దశలో అలర్జీలకు గురికాకూడదు. అలర్జీల వల్ల శ్వాసలో ఇబ్బందులు, ఇది గర్భిణీ స్త్రీలలో చాలా సాధారణంగా వచ్చే లక్షణాలు. ఇవి గర్భిణీలో హార్మోనులు పెరుగుదల మరియు బ్లడ్ వాల్యూమ్ వల్ల వస్తుంది. అందువల్ల, ప్రెగ్నెన్సీలో అలర్జీలను నివారించుకోవడానికి హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఇవి సుక్షితమైనవి మరియు నేచురల్ వి, వీటి వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, సైడ్ ఎపెక్ట్స్ కానీ ఉండవు . అయితే, ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల పొట్టలో పెరిగే బేబీకి హాని కలుగుతుంది . కాబట్టి, అలర్జీలకు గర్భిణీలో హోం రెమెడీల మీద ఆధారపడటం మంచిది, ఉదాహరణకు, సెలైన్ ద్రవాన్ని ముక్కులో వేసుకోవడం అలర్జీని తగ్గిస్తుంది . గర్భధారణ సమయంలో అలర్జీలను నివారించడానికి మరికొన్ని హోం రెమెడీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లోని డస్ట్ చేరే కార్పెట్ మరియు మ్యాట్స్ ను తరచూ శుభ్రపరుస్తుండాలి. కార్పెట్, లేదా రగ్ మ్యాట్ రెగ్యులర్ గా ఇంట్లో వేసుకొని ఉండాలంటే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలి. దుమ్ముదులిపి సన్ లైట్ లో ప్రతి రోజూ ఒక గంట పాటు వేయాలి . ప్రతి వారం బెట్ సీట్లను మార్చాలి. వేడి నీటిలో వేసి శుభ్రం చేయడం వల్ల అలర్జీలకు కారణం అయ్యే బ్యాక్టీరియా, పోలెన్ ను నివారిస్తుంది. మరియు వాతావరణం పొడిగా ఉన్నప్పుడు విండోస్, డోర్స్ క్లోజ్ చేసి ఉండాలి . అలాగే గర్భిణీలు తీసుకొనే ఆహారాల మీద కూడా ఓకన్నేసుండాలి . ముఖ్యంగా వంకాయలు మరియు పీనట్ బటర్ వంటి ఎక్కువ అలర్జీకి కారణం అవుతాయి . ఇంకా కొంత మందికి పాలు కూడా పడవు. కాబట్టి ఎలాంటి ఆహారాలు అలర్జీలకు కారణం అవుతున్నాయో వాటికి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి .

No comments:

Post a Comment