Monday, December 14, 2015

ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీకి సహాయపడే హెర్బ్స్

గర్భధారణ సమయం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో చాలా మరింత ఏకాగ్రత, కేరింగ్ అవసరం. ఎందుకంటే మొదటి మూడునెల్లో పిండం పూర్తిగా ఏర్పడి ఉండదు కాబట్టి, గర్భిణీ స్త్రీ
తీసుకొనే ప్రతి ఒక్క ఆహారం మీద ఒక కన్నేసి ఉంచాలి. తినే ఆహారం వల్ల పిండానికి ఎలాంటి హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భణీ తీసుకొనే ఆహారాలు బేబీ డెవలంప్ మెంట్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది . అయితే గర్భిణీ స్త్రీలకోసం అనేక రకాల మందులు, చికిత్సలున్నప్పుటికీ వాటిని ఎక్కువగా వాడటం వల్ల గర్భధారణ మొదటి మూడు నెలల్లో సైడ్ ఎఫెక్ట్ కూడా అదికంగా ఉంటాయి . అందువల్ల, నేచురల్ హేర్బల్ రెమెడీస్ ను తీసుకోవడం ఉత్తమం . గర్భధారణ సమయంలో ఇవి సురక్షితమైనవని కూడా సలహాలిస్తున్నారు ఆరోగ్య నిపుణులు గర్భిణీలకు ఇతర మందులతో పోల్చినప్పుడు ప్రక్రుతి పరంగా మనకు అందుబాటులో ఉండే హెర్బ్స్ ఆరోగ్యానికి ఉత్తమమైనవి మరియు చౌకైనవి కూడా. ప్రస్తుతం ఔషధాలు, పౌడర్లు, సప్లిమెంట్స్, క్యాప్స్యూల్స్, టీ అండ్ ఇన్ఫ్యూషన్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి సహాయపడుతాయి . హెర్బ్స్ లో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ గర్భధారణ సమయంలో వచ్చే స్ట్రెస్, వికారం, మరియు మజిల్ క్రాంప్స్ వంటి ఎన్నో సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇంకా, హెర్బ్స్ సహజమైనవి, అన్ని రకాల హేర్బ్స్ సురక్షితమైనవి కావు. గర్భిణీ స్త్రీలు ఎలాంటి హేర్బల్స్ తీసుకోవాలన్నా ముందు డాక్టర్ ను సంప్రదించి వారి సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది . ఈ ఆర్టికల్లో కొన్ని హేర్బల్ రెమెడీస్ గర్భిణీలకు సురక్షితమైనవి లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.  

No comments:

Post a Comment