ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగష్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా వాబా (వరల్డ్ అలైన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్షన్ ) సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యు.హెచ్.ఓ (WHO), యునిసెఫ్ (UNICEF) మరియు
బి.పి.ఎన్.ఐ (BPNI) వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థల అనుబంధంగా జరుపబడుచున్నది.
తల్లి పాల సంస్కృతిని ప్రోత్సహించి, సహకరించి, రక్షించుకోవడానికి ప్రతి సంవత్సరం ఒక క్రొత్త సందేశముతో ఈ వారోత్సవాలు జరుగుచున్నవి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల విశిష్టత గురించి తెలుసు కుందాం!
అమ్మపాల కమ్మదనం, తల్లిపాల గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవి అమ్మ పంచే అమృతం. జీవితాంతం బిడ్డకు అండగా నిలుస్తుంది. వారిని అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు అనబడే దుష్టశక్తులు పిల్లలకు సోకకుండా రక్షణ కవచంలా కాపాడుతుంది. తల్లిపాలు చేసే మేలు తెలిసీ నిర్లక్ష్యం చేయడం, తల్లిపాల గొప్పదనాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం నేటి తరంలో వున్న పెద్ద లోపం.
ఈ రోజు ఆగష్ట్ 1న ఇంటర్నేషనల్ బ్రెస్ట్ ఫీడింగ్ డే. అయితే, ఆగష్టు మొదటి వారం మొత్తం తల్లిపాల వారోత్సవాలు జరపుకుంటారు. ఈ వారోత్సవాల ద్వారా గర్భిణీలకు అవగాహన కల్పించడం కోసం వారోత్సవాలను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఆగష్టు మొదటివారం తల్లిపాల వారోత్సవం సందర్భంగా తల్లిపాలలో దాగున్న అపరిమిత సుగుణాలను గురించి తెలుసుకుందాం. తేలిగ్గా జీర్ణమయ్యే గుణం తల్లిపాలలో వుంది.
పాపాయికి కావలసిన పోషకాలు తల్లిపాలతోనే సాధ్యం. రోజుకు పదిసార్లు, తాగితే మరింతగా తల్లిపాలు పట్టించవచ్చు. ఇందులో మరే సందేహాలకూ తావులేదు. పాలివ్వడంలో మరో సౌలభ్యం కూడా వుంది. పాపాయికి, తల్లికి మధ్య స్పర్శలోని అనుబంధం వారిని మరింత దగ్గర చేస్తుంది. పాలిచ్చే సమయంలో అమ్మకు చేరువగా వున్నాననే భరోసా బిడ్డకు అవసరం. పాపాయి శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో సాయపడతాయి.
తల్లిపాలు తాగిన పిల్లలు ఊబకాయం బారిన పడరు. తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేదు. ఖరీదైన పాలపొడులు తల్లిపాల పోషకాలను భర్తీ చేస్తాయనుకోవడం తప్పు. నపోతపాలలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు అనేకం. అక్కడ్నుంచి పిల్లలు ఎదుర్కొనే సమస్యలెన్నో వుంటాయి. పట్టకూడదంటూ పిండి పారబోసే ముర్రిపాలలో ప్రోటీన్లు, ఇమ్యునోగ్లోబిన్ పదార్థాలు అధికం. అవి పిల్లలను జీవితాంతం కాపాడతాయి. తొలి మూడు రోజుల్లో వచ్చే ముర్రిపాలలో రోగనిరోధకశక్తి ఎక్కువ. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే వ్యాధి నిరోధక కారకాలు ముర్రిపాలలో వున్నాయి.
పుట్టిన వెంటనే పాలు రావట్లేదనో, మంచిది కాదనో కాకుండా పాపాయికి పాలుపట్టాలి. తేనె, పంచదారనీళ్లు, నీరు, గ్లూకోజ్ పట్టవద్దు. అసలు చంటిపిల్లలకు ఆరునెలల వరకూ తల్లిపాలు చాలు! తల్లిపాల ఆవశ్యకతను తల్లిగా మారే ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి. పాలిస్తే తీరైన ఆకృతికాస్తా చెడిపోతుందనే భ్రమలు తల్లులు వదులుకోవాలి. అందం తగ్గిపోవడం, స్తనాలు జారడమనే భ్రమలన్నీ అపోహలే.
పైపెచ్చు పాలిస్తే మాతృత్వంతో కూడిన సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. వారి ఆరోగ్య జీవితానికి జీవితాంతం తోడుగా నిలిచే తల్లిపాలను అందంతో తూకం వేయవద్దు. తల్లిపాలు ఇవ్వడమంటే కలల పంటలకు సంపూర్ణాహారాన్ని అందించినట్లే. అంటే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడటంలో మన వంతు పాత్ర పోషించినట్లే! మాతృత్వమనే అద్భుత వరాన్ని అందించే పాపాయిలకోసం... మురిపాలతోపాటూ తల్లిపాలు అందించి బదులు తీర్చుకోవాల్సిన ఆవశ్యకత తల్లిదే!

No comments:
Post a Comment