Saturday, June 20, 2015

మీరు రాస్తే మంచిది

మనకు బాగా తెలియని మనుషుల్ని కలవడానికి వెళ్ళేప్పుడు మాట్లాడాల్సిన విషయాల్ని పేపర్‌ మీద రాసుకోడం మంచిది. ఏదైనా ప్రాజెక్టు గురించి మాట్లాడాలను కుంటే మీ ప్రపోజల్‌ గురించి కొన్ని పాయింట్స్‌ రాసుకోవాలి.

మొదటి నిమిషంలో మీరు మాట్లాడే విషయాల పట్ల ఆసక్తి కలిగించేలా మొదలుపెట్టాలి. అలాంటప్పుడే మీతో పది నిమిషాలు మాత్రమే మాట్లాడాలనుకునేవారు అరగంటయినా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ముందస్తు కసరత్తు అవసరం. కనుక సూటిగా, ప్రభావవంతంగా, వినసొంపుగా మాట్లాడటానికి మీరు చెప్పాలనుకునే విషయాల్ని పాయింట్స్‌గా రాసుకోవాలి. అలాగే ఆఫీసుల్లో మీటింగ్స్‌లో మాట్లాడే విషయంలో కూడా ప్రిపరేషన్‌ అవసరం. మాట్లాడేది రెండు నిమిషాలయినా, అయిదు నిమిషాలయినా స్పష్టంగా మీ అభిప్రాయాలు చెప్పాలంటే ముందుగా కాగితం మీద మీరు చెప్పాలనుకునే విషయాల్ని రాసుకోవడం ఉత్తమం. కాగితం మీద రాసుకుంటే చెప్పాలనుకున్నది క్లుప్తంగా, అర్థవంతంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment