యోగ మన భారత గ్రంధములో వివరించబడిన ఒక పురాతన కళ. యోగ అనేది ఒక ఆధునిక శాస్త్రం మరియు బుషులు జ్ఞానం యొక్క కలయిక అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆది మానవుని జననంతోనే యోగ విద్య ప్రారంభమైంది. యోగ మనిషి జీవన విధానమని చెప్పవచ్చు. యోగాభ్యాసం మనిషికి ఆరోగ్యం, శక్తి, తేజస్సు,
చురుకుదనం ప్రసాదించడమే గాక మనిషి జీవితంలో సుఖ, సంతోష, ఆనందాల్ని నింపుతుంది. ఆరోగ్యం సరిగా లేకపోతే సిరిసంపదలు ఎన్ని వున్నా ఏం లాభం చెప్పండి? పరమేశ్వరుడు యోగ విద్యకు ఆద్యుడు అని అంటారు. అనేకమంది యోగులు, మునులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మార్షులు యోగావిద్యను ప్రపంచానికి అందించారు.
జిమ్ కన్నా యోగ ఉత్తమమైనదని చెప్పటానికి 15 కారణాలు
యోగశాస్త్రం మన భారతదేశంలో ఆధ్యాత్మికత్వాన్ని సంతరించుకొని మూడు పూవులు ఆరు కాయలుగా వర్థిల్లింది. ఈనాటి యుగంలో యోగవిద్యకు సైన్సుసాయం లభించింది. పలువురు మేధావులు, డాక్టర్లు, నిపుణులు ఈ రంగంలో ప్రవేశించి శారీరక, మానసిక వికాసానికి దోహదం చేసే విధంగా యోగశాస్త్రాన్ని మలిచి యోగాచికిత్సా విధానం ప్రారంభించి మానవాళికి మహోపకారం చేశారు, చేస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం 2015 ఇంటర్నేషనల్ యోగ డే(అంతర్జాతీయ యోగా దినోత్సవం)ను రిపబ్లిక్ డే తరహాలో కవరేజ్ కు సర్వం సిద్దం చేస్తున్నారు.
తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా కవరేజ్ చేసేందుకు దూరదర్శన్ (డీడీ) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21న ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని రిపబ్లిక్ డే తరహాలో కవర్ చేసేందుకు డీడీ సన్నద్ధమవుతోంది. ఈ యోగ డే సందర్భంగా మీకోసం కొన్ని యోగాసనాలు బరువు తగ్గించుకోవడానికి, బ్యాక్ పెయిన్ నివారించుకోవడానికి మరియు మంచి ఆరోగ్యం పొందడానికి ఈ క్రింది స్లైడ్ ద్వారా పరిచయం చేస్తున్నాము.

No comments:
Post a Comment