Sunday, May 10, 2015

అమ్మా ! నువ్వంటే ఎంతో ఇష్టం

     
 అమ్మ గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. అమ్మ పేమను దేనితో పోల్చలేం, కొలవలేం. ఎలాంటి తారతమ్మం లేకుండా బిడ్డలందరికీ పేమను సమానంగా పంచుతుంది. అందుకే అమ్మంటే అందరికీ ప్రాణం. మన కోసం ఇన్ని త్యాగాలు చేస్తున్న అమ్మకు ఈరోజు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు...

      పసితనంలో కంటికి రెప్పలా కాపాడుతూ... వెన్నెలో గోరుముద్దలు తినిపిస్తూ... బాల్యంలో చదువై నేర్పిస్తూ... యవ్వనంలో మార్గదర్శకురాలిగా ఉంటూ... ఉద్యోగచ వివాహా సమయాల్లో నీ అభివృద్ధికై తోడ్పడుతూ... ఎండుటాకై రాలిపోయే సమయంలో కూడా బిడ్డల బాగోగుల గురించేది ఒక్క అమ్మ మాత్రమే. బిడ్డల బాగోగులే జీవితంలా బతుకుతుంది అమ్మ. అమ్మ కమ్మదనాన్ని గౌరవిస్తూ చేసుకునేదే ఈమాతృదినోత్సవం. ఇది ఎలా ఏర్పడిందంటే...

అమ్మలు తమ బిడ్డల కోసమే కాక సమసమాజానికి చేస్తున్న ప్రత్యేక సేవలను గుర్తిస్తూ జరుపుకునే ఈ ప్రత్యేక మాతృదినోత్సవం ప్రతి సంవత్సరం మే రెండో ఆదింఆరం ప్రపంచవ్యాప్తంగా జరుకుంటారు. మొదట్లో మాతృదినోత్సవాన్ని బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్న ఈ మదర్స్ డేకి జార్విస్ నాందిపలికాదు. ఆమె తల్తి అన్నా జార్వీస్కి మదర్స్ డే ఒకటి ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఉండేది. ఆమె తన ఆశయం నెరవేరకుండానే మే 9.1905న కన్నుమూశారు. ఆ తర్వాత ఈ కార్య క్రమానికి కూతరు మేరీ జార్వీస్ శ్రీకారం చుట్టింది. చిన్నచిన్న సేవా కార్య క్రమాల తర్వాత ఓ స్టేడియంలో పెద్ద వేడుకని చేపట్టింది. తర్వాత అమెరికాలో మదర్స్ డేను జాతీయ సెలవుదినంగా ప్రకలించాలని మేరీ ప్రచారం ప్రారంభించింది. తదనంతరం మాతృదినోత్సవాన్ని అంతర్జాతీయంగా సెలవుదినోత్సవంగా ప్రకటించాలని ప్రచారం చేపట్టింది. మద్దతు కూడగట్టింది. మొదటి ... పశ్చిమ వర్జీనియా రాష్ర్టం 1910లో అధికారికంగా సెలవుదినాన్ని ప్రటికంచింది. తర్వాత కూడా ఆ వెంటనే దీనికి సంబంధించిన ప్రకటనలు వెలువరించాయి. మే 8, 1914న యూఎస్ కాంగ్రెస్ మే నెల రెండో ఆదివారాన్ని మదర్స్ డేగా గుర్తిస్తూ ఒక చట్టాన్ని చేసింది. మే9,1914నాటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మొదటి జాతీయ మాతృదినోత్సవం గుర్తింపు ప్రకటన చేశారు. యుద్ధంలో మరణించిన బిడ్డల తల్లులకు అమెరికా పౌరులు నివాళులు అర్పించే రోజుగానూ మదర్స్ డేను ప్రచారంలోకి తెచ్చారు. మాతృదినోత్సవం ఇప్పుడు అమెరికాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా వాడవాడలా జరుపుకుంటారు. మరి, మీరు కూడా మీ అమ్మను అశ్చర్యానికి గురిచేసేలా ప్రత్యేకంగా మదర్స్ డేను జరిపి అమ్మను సంతోషపరచండి.

No comments:

Post a Comment