Monday, April 13, 2015

గర్భిణీ మహిళలు ఎండు ద్రాక్ష ఎందుకు తినాలి?

       
మహిళలు గర్భం పొందితే తీసుకొనే ఆహారం విషయంలో కొన్ని హద్దులు పెడుతుంటారు. ప్రత్యేకంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతారు. గర్భిణీ స్త్రీలు తీసుకొనే ఆహారాలు తల్లి మరియు కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యానికి ఉపయోగకరమైనవిగా ఉండాలి. గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డకు హానికలిగించే బొప్పాయి మరియు పైనాపిల్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. మరి ఎండు ద్రాక్ష గర్భిస్గ్రీలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది ? గర్భిణీ స్త్రీలు ఎండు ద్రాక్షతినడం వల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని మీకు ఈ రోజు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఎక్కువ న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండే సరైన ఆహారంను ఎక్కువగా తీసుకోవాలి. న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే ఆహారాల్లో ఖర్జూరం, ఆప్రికాట్స్, నట్స్ మరియు ఎండు ద్రాక్షవంటి డ్రై ఫ్రూట్స్ గర్భిణీలకు చాలా ప్రయోజనాలను అందిస్తాయి . ఎండు ద్రాక్షలో పొటాషియ, క్యాల్షియం, మరియు మెగ్నీషియం అధికంగా ఉన్నాయి . అంతే కాదు వీటిలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ మరియు మినరల్స్ అధికంగా ఉన్నాయి. ఎండు ద్రాక్షలో న్యూట్రీషియన్ విలువలు గర్భిణీకి మరియు పొట్టలో పెరుగుతున్నశిశువుకు కూడా చాలా ఆరోగ్యకరమైనవి.

No comments:

Post a Comment