Wednesday, February 4, 2015

పాపాయి బాడీ మసాజ్ కోసం .........


భారత్ లో పాపాయికి మర్దనా చేసే ప్రొసీజర్ ఎంతో ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా, పాపాయికి మర్దనా చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ పై, పాపాయి ఆరోగ్యంగా మర్దనా చూపించే ప్రభావంపై హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అలాగే డాక్టర్స్ అభిప్రాయ బేధాలున్నాయి. పాపాయికి నూనెతో మసాజ్ చేయడం వల్ల పాపాయి ఉపశమనం పొందుతుంది. పాపాయి చర్మం మృదువుగా, కోమలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. తరచూ పాపాయికి మర్దనా చేయడం ఎంతో ముఖ్యం.
 ఆయిల్ మసాజ్ బెనిఫిట్స్ 
చాలా ఇళ్ళల్లో ప్రత్యేకించి భారతీయ ఇళ్ళల్లో పాపాయికి స్నానానికి ముందు గాని స్నానం తరువాత గాని మసాజ్ చేయడమనేది సాధారణ అంశం. పాపాయికి మసాజ్ చేయడం ద్వారా వివిధ రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం. అలసిపోయిన పాపాయి అవయవాలకు, కండరాలకు మసాజ్ ద్వారా ఉపశమనం కలుగుతుంది. పాపాయి చర్మం నిగారింపుకై మసాజ్ తోడ్పడుతుంది మీకు మీ చిన్నారికి మసాజ్ ద్వారా బాండింగ్ ఏర్పడుతుంది. మీ చిన్నారికై మీరు సమయం కేటాయించేందుకు ఇదొక ముఖ్య సందర్భం. 
పాపాయి మసాజ్ కు బెస్ట్ బేబీ ఆయిల్ 
మీ పాపాయికి మసాజ్ చేసే విధానం ఎంత ముఖ్యమో, మసాజ్ కు వాడే ఆయిల్ కూడా అంతే ముఖ్యం. ఏదో ఒక నూనె లేదా క్రీమ్ తో పాపాయికి మసాజ్ చేయకూడదు. పాపాయి చర్మం సున్నితమైనది కాబట్టి ఎంచుకునే నూనె గురించి బాగా స్టడీ చేయాలి. పాపాయి మసాజ్ కి వాడే నూనె పాపాయికి ఆనందాన్ని కలిగించాలి గాని అసౌకర్యాన్ని కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. చంటిపిల్లల చర్మం చాలా పొడిగా ఉంటుంది. చాలా సున్నితంగా ఉంటుంది. చర్మంపై పొడితనం పెరుగుతూ ఉంటే దాని వల్ల కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశాలుంటాయి. ర్యాషేస్, గజ్జి, తామర వంటి స్కిన్ డిసీజెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పాపాయి చర్మానికి నాణ్యమైన నూనెని వాడితే వారి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పాపాయి చర్మానికి ఏ నూనె మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నారా? పాపాయి చర్మానికి సరిపడే టాప్ 10 ఆయిల్స్ లిస్టుని మీకు తెలియజేస్తున్నాము. వీటితో పాపాయికి మర్దనా చేస్తే ఎన్నో లాభాలుంటాయి.

No comments:

Post a Comment