Monday, January 26, 2015

గర్భిణీలు స్వైన్ ఫ్లూ బారిన పడితే ...

 స్వైన్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తున్నది. సాధారణంగా ఉండే వారికంటే, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ వ్యాధి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి . ఎందుకంటే సాధారణ వ్యక్తులతో పోల్చితే, గర్భిణీ స్త్రీలలో, పాలిచ్చే తల్లులకు వైరస్ వల్ల కలిగే
నష్టం ఎక్కువ. అందుకే ఈ వ్యాధి సోకకుండా టీకాలు ఇప్పించాలి . ఒక వేళ పొరపాటుగా ఈ స్వైన్ ఫ్లూ వ్యాధికి గురైతే వెంటనే డాక్టర్ ను సంప్రధించాలి. గర్భిణీలకు స్వైన్ ఫ్లూ గర్భిణీల మీద స్వైన్ ఫ్లూ ప్రభావం ఎక్కువ. ఇతర అనారోగ్యాలు కూడా ఉన్నగర్భిణీలకు ఈ వ్యాధి వల్ల మరింత ప్రమాధం. ఈ వ్యాధి బారిన పడిన కొందరు గర్భిణీలు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గర్భం ధరించిన తొలి నెలల్లో తీవ్రమైన జ్వరం వస్తే శిశువుకు అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత నెలల్లో గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే ప్రసవించటం, గర్భంలో శిశువుకు ఊపిరి అందక పోవడంలాంటి సమస్యలు తలెత్తుతాయి . కాబట్టి, స్వైన్ ఫ్లూ బారిన పడిన గర్భిణీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
గర్భిణీలు తీసుకోవల్సిన జాగ్రత్తలు: 
గర్భిణీలకు స్వైన్ ఫ్లూ వైరస్ తేలికగా సోకుతుంది . కాబట్టి వీళ్లు రోగులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అలాగే స్వైన్ ఫ్లూ ఉన్న వ్యక్తుల సంరక్షణలో గర్భిణీలు ఉండకూడదు. స్వైన్ ఫ్లూ వ్యాప్తిలో ఉన్నప్పుడు జనం సమూహం ఎక్కువగా ఉండే హాస్పిటల్స్, సినిమాల హాళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్ లకు గర్భిణీలు వెళ్లకూడదు. 
ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత తీసుకోవల్సిన జాగ్రత్తలు 
ప్రసవ సమయంలో, ప్రసవమయ్యాక స్వైన్ ఫ్లూ వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లూ లక్షణాలున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. బాలింతతోపాటు, కుటుంబ సభ్యులు కూడా స్వైన్ ఫ్లూ పట్ల అవగాహన కలిగి ఉండి జాగ్రత్తలు పాటించాలి. ప్రసవమయ్యాక బాలింతలు సాధ్యమైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలి. బిడ్డ పుట్టిన గంటలోపే పాలివ్వటం ప్రారంభించాలి. ఇలా చేస్తే శిశువులో రోగనిదోధకశక్తి పెరిగి స్వైన్ ఫ్లూ వైరస్ నుంచి రక్షణ దొరుకుతుంది. స్వైన్ ఫ్లూ గర్భిణీలు తీసుకోవల్సిన మరికొన్ని జాగ్రత్తలు 
వ్యాధి నిరోధక శక్తిని పెంపొంధించుకోవాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకుంటుండాలి ఎప్పుడూ ముక్కు మరియు నోటిని కవర్ చేసి ఉంచుకోవాలి హెచ్ 1 ఎన్ 1 వైరస్ ఉందని నిర్ధారణ అయితే ఆ గర్భిణీలకు సపోర్టివ్ చికిత్సతోపాటు యాంటీవైల్ చికిత్స కూడా ఇప్పించాలి. స్వైన్ ఫ్లూ ఉన్న గర్భిణీలు లేని గర్భిణీలకు ధూరంగా ఉండాలి. ప్రత్యేకమైన గదిలో ప్రసవం చేయాలి. గదిలో గాలి ధారళంగా రావాలి. శిశువును తల్లినుంచి వేరు చేయకూడదు. తల్లి దగ్గరే శిశువుకు రక్షణ ఉంటుంది. తల్లి పాలలో ఇన్ఫెక్షన్ తో పాటు దాన్నుంచి రక్షణ కల్పించే యాంటీ బాడీలు కూడా ఉంటాయి. కాబట్టి, తల్లి పాలను మాత్రమే శిశువుకు పట్టించాలి. ఈ వ్యాధి ఉందని అనుమానం ఉన్నప్పుడు ఫలితాల కోసం వేచి చూడకుండా వెంటనే వైద్యం ప్రారంభించాలి. స్వైన్ ఫ్లూ బాధిత గర్భిణీలు, బాలింతల సంరక్షకలు వ్యాక్సీన్ తీసుకోవాలి. గర్భిణీ ప్రసవించేటప్పుడు చిందే రక్తం, ఉమ్మనీరు ద్వారా కూడా స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తిస్తుంది. కాబట్టి ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 
హెచ్ 1ఎన్ 1టీకా ఎప్పుడు తీసుకోవాలి? 
ఈ టీకా స్వైన్ ఫ్లూను సమర్థంగా నయం చేయగలదు. అయితే గర్భిణీలు, బాలింతలకు ఈ టీకా ఇప్పించటానికి కొన్ని నియమాలు పాటించాలి. ఇకాక్టివేటెడ్ లేక నిర్జీవ టీకా మాత్రమే వేయాలి. గర్భిణీలు మొదటి మూడు నెలల్లో టీకా వేయించుకోకూడదు. 4నుండి 6 నెలల మద్యలో ఒకసారి టీకా వేయించుకుంటే తల్లితో పాటు శిశువుకు కూడా స్వైన్ ఫ్లూ నుంచి రక్షణ లభిస్తుంది.

No comments:

Post a Comment