Wednesday, August 13, 2014

తెల్ల జుట్టు నివారించడానికి....

ప్రస్తుతం ఈ మోడ్రన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందంగా కనబడుటకు ఆరటపడుతున్నారు. ఇది ఒక్క మహిళల్లో మాత్రమే కాదు, పురుషులు కూడా అందుకు ముందున్నారు. అందంతో పాటు, స్త్రీలతో పాటు, పురుషులు కూడా వారి జుట్టును
సంరక్షించుకోవడం తగిన జాగ్రత్తలు పాటిస్తూ, దీర్ఘకాలం పాటు జుట్టు అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంత అందంగా ఉంచుకొనే, కాలంతో పాటు మానవ శరీరంలో వచ్చే మార్పులో గ్రేహెయిర్ (తెల్ల జుట్టు)కు కూడా ఒక కారణం. అయితే గ్రే హెయిర్ అనేది ప్రతి ఒక్కరి జీతితంలో ఎదురయ్యే సమస్యే అయినా, అతి చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతుంటారు . గ్రే హెయిర్ జ్ఞానం మరియు పరిపక్వతతో ముడిపడి ఉన్నందున మీరు చూడటానికి యంగ్ మరియు బ్యూటిఫుల్ గా ఉంటారు. అలా యంగ్ గా ఉండాలంటే, తెల్లజుట్టు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ జుట్టు కలర్ సహజంగా ఉండేలా ఎందుకు కోరుకుంటారు? మీరు మార్కెట్లో ఒటిసి హెయిర్ ప్రొడక్ట్స్ ను కనుగొనవచ్చు. ఇవి మీ జుట్టుకు నేచురల్ హెయిర్ కలర్ ను అందిస్తాయి. అలాగే వైబ్రాంట్ షేడ్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల చూడటానికి స్టైలిష్ గా కనబడుతుంది. అయితే, ఈ కలర్స్ లో కొన్ని కెమికల్స్ ఉపయోగించడం వల్ల అనేక పరిణామాలకు దారితీయవచ్చు. చాలా వరకూ ఓటిసి హెయిర్ కలర్ ఉత్పత్తుల్లో ఎక్కువగా అమ్మోనియా మరియు ఇతర కఠిన కెమికల్స్ ను వినియోగిస్తుంటారు. ఇటువంటి ఉత్పత్తులు సున్నిత చర్మ తత్వం కలవారికి జుట్టుకు హానికలిగించవచ్చు. అదే సమయంలో ఇటువంటి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్స్ కు గురిచేసి , జుట్టు రాలడానికి కారణం అవుతుంది. ఈ సమస్యలకు పరిష్కార మార్గంగా నేచురల్ హెర్బ్స్ మరియు వాటి యొక్క ద్రవాలను ఉపయోగించడం వల్ల వీటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు మరియు వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు. అందులో ఇవి ఖరీదైనవి కూడా కాదు మరియు ఇటువంటి సొల్యుషన్స్ ను మీరు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మీ జుట్టుకు కలరింగ్ ఇవ్వడంతో పాటు, ఈ హెర్బ్స్ లో నేచురల్ హెయిర్ కలర్స్ కలిగి ఉంటాయి, ఇవి జుట్టుకు తగినంత పోషణ కూడా అందిస్తాయి. మరి బెస్ట్ నేచురల్ హోం మేడ్ హెయిర్ కలర్స్ ఏంటో .

కొబ్బరి నూనె మరియు కరివేపాకు: కొబ్బరి నూనె అమేజింగ్ మాయిశ్చరైజింగ్ మరియు ఇది తలకు మరియు జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. కరివేపాకును ఉపయోగించినప్పుడు, ఇది ఆయుర్వేద గుణాలను అందిస్తుంది. దాంతో గ్రే హెయిర్ ను కవర్ చేస్తుంది. అరకప్పు కరివేపాకులో కొబ్బరినూనెను వేయాలి . దీన్ని సాస్ పాన్ లో వేసి నిదానంగా తక్కువ మంట మీద కాచుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం చల్లార్చనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని తలకు మరియు జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.


No comments:

Post a Comment