రక్త సంబందానికి రూపం రక్షా అత్మీయ బందానికి ఆదారం రాఖీ ఆ రెండింటి సమ్మిళితమైన తోబుట్టువుల తీయటి జ్ఞాపకం రక్షాబందన్ తరాలుమారిన తరగని
వన్నేతో తారతమ్యం లేకుండా జరుపుకుంటున్న పండుగ రక్షాబందన్. తోబుట్టువుల అప్యాయత అనురాగం ఎప్పటికి ఎవ్వరు మరువలేరు ఈ అనుబంధానికి ప్రతికగా నిలిచే శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. దేశవ్యాప్తంగా పండుగరోజు అన్నదమ్ముళ్లకు అక్కాచెల్లెల్లు తప్పకుండా రాఖీలు కట్టాలని ఆరాటపడుతుంటారు. అత్మీయతను పెంచే బందం మరింత బలపడాలంటే రక్షాబందన్ తో పాటు నోటికి కమ్మని రుచికరమైన వంటను రుచిచూపించాల్సిందే. ఎప్పడూ రెగ్యులర్ గా చేసుకొనే వంటలు కాకుండా, ప్రత్యేకంగా ఇలా శుభకార్యాలప్పడు డిఫరెంట్ వంటలను తయారుచేసుకుంటే ఆ అకేషన్ కే మరికొంత అనందం, ఆహ్లాదం తోడవుతాయి. మరి మీ తోబుట్టువులకు, అన్న, తమ్ములకు రక్షాబందన్ రోజున ప్రత్యేకంగా ఉండాలంటే ఒక స్పెషల్ వంటను రుచి చూపించండి. అటువంటి వంటల్లో ఒకటి స్పినాచ్ పకోడ, చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. అంతే కాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ హెల్తీ స్పినాచ్ పకోడా తింటూ రక్షాబందన్ సెలబ్రేట్ చేసుకోండి...
కావల్సిన పదార్థాలు:
ఆకుకూర: 1కట్ట(సన్నగా తరిగిపెట్టుకోవాలి. ఉల్లిపాయ: 1సన్నగా తరిగినవి శెనగపిండి: 1cup ఉప్పు రుచికి సరిపడా పచ్చిమిర్చి: 4-5సన్నగా తరిగిపెట్టుకోవాలి కారం: 1/4tsp కసూరి మేతి: 1tbsp గరం మసాల: 1/2tsp నూనె: 2 cups
తయారుచేయు విధానం:
1. ముందుగా పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకొన్న ఆకు కూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేయాలి.
2. ఇప్పుడు అందులోనే శెనగపిండి కూడా వేయాలి. తర్వాత ఉప్పు, కారం, కసూరి మేతి మరియు గరం మసాలా వేసి మొత్తాన్ని బాగా కలగలుపుకోవాలి.
3. ఇప్పుడు అందులో సరిపడా నీళ్ళు పసి మెత్తగా కలుపుకోవాలి.
4. తర్వాత చేత్తో కొద్దికొద్దిగా తీసుకొని అరచేతిలో పెట్టుకొని మరో చేత్తో కట్ లెట్ లా ఒత్తుకోవాలి . లేదా అలాగే ఉండలుగా కూడా కాగే నూనె లో వేసి వేగించుకోవచ్చు.
5. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో సరిపడా నూనె పోసి వేడయ్యాక అందులో ఈ బాల్స్ ను వేయాలి .
6. ఒక 5 నిముషాలు మీడియం మంట మీద డీప్ ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత ఫ్రై చేసి పకోడలను టిష్యు పేపర్ మీద వేసుకోవాలి. ఇలా చేస్తే అదనపు నూనెను గ్రహిస్తుంది. అంతే స్పినాచ్ పకోడ రెడీ . వీటిని పుదీనా చట్నీ లేదా మీకు నచ్చిన సాస్ తో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి .

No comments:
Post a Comment