Wednesday, June 4, 2014

పుదీనా ఆకులతో బాడీ మరియు స్కిన్ బెనిఫిట్స్

అందంగా ఉండాలనుకొనే ప్రతి ఒక్కరూ వారి చర్మ సంరక్షణకు ఉపయోగించేటటువంటి సరైన బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం ఎంపిక చేసుకోవడంలో
గందరగోళం చెందుతుంటారు . మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ తాత్కాలికంగా మార్పులు కలిగించినా వాటి సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఉంటాయి. అందుకు చాలా మంది మార్కెట్లో లభించే కమర్షియల్ ఉత్పత్తులకు జోలికి పోకుండా ఇంట్లో మనకు నేచురల్ గా అందుబాటులో ఉండే కొన్ని హోం రెమడీస్ ను ఉపయోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితమైన చర్మాన్ని పొందుతారు. అలోవెరా మరియు పుదీనాను చాలా మంది చర్మం సంరక్షణలో భాగంగా వినియోగిస్తుంటారు. కాబట్టి, పుదీనాలో కూడా స్కిన్ కేర్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయనే విషయాన్ని ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. పుదీనానే ఎందుకు? అని మీలో సందేహం కలగవచ్చు. పుదీనా ఒక నేచురల్ హెర్బ్(మూలిక). ఇది ఒక ఘాటైన సువాసన కలిగి ఉంటుంది . ఇది వివిధ రకాలుగా మాయిశ్చరైజర్ గా, క్లెన్సర్ గా మరియు లోషన్ గా మనకు దొరుకుతుంది. ముఖ్యంగాపుదీనాతో తయారుచేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ ను చర్మం సంరక్షణకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరియు చర్మానికి అనేక ప్రయోజనాలను అంధిస్తుంది.


No comments:

Post a Comment