Sunday, June 1, 2014

జుట్టు చిట్లడానికి కారణాలు ...

స్త్రీ మరియు పురుషులు ఎదుర్కొనే ఒక ప్రధాన జుట్టు సమస్య హెయిర్ బ్రేకేజ్. మీకు పొడవాటి జుట్టు ఉన్నట్లైతే ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది .
హెయిర్ బ్రేకేజ్ అనేది ప్రధానంగా హెయిర్ డ్యామేజ్ వంటిదే. ఇది మీ జుట్టును మరింత రఫ్ గా మార్చుతుంది. దాంతో మీ జుట్టు చూడటానికి అనారోగ్యకరంగా ఉంటుంది. హెయిర్ బ్రేకేజ్ కు కారణం స్పష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, జుట్టు చిక్కుబడటం, ముడులు బడటం వల్ల జుట్టు మద్యలోనిక తెగిపోతాయన్న విషయం మనందరికి తెలిసిన విషయమే. వీటివల్లే చాలా సులభంగా హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. అలాగే తడి జుట్టును స్టైలింగ్ చేయడం వల్ల కూడా, హెయిర్ బ్రేకేజ్ కు కారణం కావచ్చు. హెయిర్ బ్రేకేజ్ కు చిక్కు, ముడులు మాత్రమే కారణం కాదు, హెయిర్ బ్రేకేజ్ అవ్వడానికి మరికొన్ని కారణాలు కూడా దాగున్నాయి. జుట్టు చిట్లడం మరియు చిట్లిన జుట్టు డ్యామేజ్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి.
జుట్టు చివర్లు చిట్లడానికి కారణాలు అనేకం. తగినంత తేమ లేకపోవడం, ఎండకు ఎక్కువగా తిరగడం, గాఢత కలిగిన షాంపూల వాడకం, హెయిర్ డ్రయర్‌తో ఎక్కువ సేపు ఆరబెట్టడం, హెయిర్ స్ట్రెయిటెన్ చేయడం, రంగు వేయడం, హెయిర్ బ్లీచ్ చేయించడం... వంటివన్నీ జుట్టు చిట్లడానికి దారితీస్తాయి.


No comments:

Post a Comment