Friday, June 6, 2014

గర్భిణీలు పొందే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు గర్భం దాల్చగానే వెంటనే వారి డైట్ మారిపోతుంటుంది. శిశువు ఆరోగ్యానికి పెరుగుదలకు అవసరం అయ్యే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటుంటారు .
గర్భం ధరించిన మహిళలు చాలా సున్నితమైన మరియు మంచి సమతుల్య పౌష్టికాహారంను తీసుకోవడం వల్ల కడుపులో పెరిగే శిశువు ఆరోగ్యకరంగా పెరగడానికి సహాయపడుతుంది . గర్భాధరణ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల గర్భాధరణ సమయంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితంగా గర్భాదరణ సమయం పూర్తి అవ్వడానికి , సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడుతుంది. కొంత మంది నిపుణులు మరియు పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భధారణ సమయంలో గర్భిణి కార్న్ ఫ్లేక్స్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారని అంటున్నారు . గర్భిణీ మహిళలు రోజులు 6 చిన్న మీల్స్ తీసుకోవడం వల్ల వారి ఎనర్జీ లెవల్స్ అధికంగా ఉంచడంతో పాటు బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంచుతుంది. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం గర్భిణీ స్త్రీల డైట్ లో అధికంగా డైటరీ ఫైబర్ ఉంటే కడుపులో శిశువు పెరుగుదల మెరుగ్గా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు . కార్న్ ఫ్లేక్స్ లో అధికంగా ఫైబర్ ఉండటం చేత గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఆరోగ్యకరం అంటున్నారు. మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు 'పాప్ కార్న్', 'కార్న్ ఫ్లేక్స్' తయారుచేస్తారు. ఈ కార్న్ ఫ్లేక్స్ గర్భిణీ స్త్రీలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. దీనిలో వుండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్ళు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్కజొన్న తింటే, తల్లికి, బిడ్డకు కూడా ప్రయోజనమే. ఒక కప్పు కార్న్ ఫ్లేక్స్ వల్ల 25గ్రాముల ఒక రోజుకు సరిపేడే ఫైబర్ పొందవచ్చు. మీ రెగ్యులర్ డైట్ లో అధిక ఫైబర్ తీసుకొన్నప్పుడు, బ్లడ్ ప్రెజర్ మరియు మలబద్దకం వంటి గర్భధారణ సమస్యలను ఘననీయంగా తగ్గిస్తుంది. గర్భిణీలకు కార్న్ ఫ్లేక్స్ వల్ల ఎక్కువ డైటరీ ఫైబర్ ను పొందవచ్చు . ఇది గర్భిణీలలో మలబద్దక సమస్యలు లేకుండా బౌల్ మూమెంట్ ను సాఫీ చేస్తుంది. గర్భధారణ సమయంలో కార్న్ ఫ్లేక్స్ వల్ల మరో ప్రయోజనం కడుపులో పెరిగే శిశువు వల్ల ఎర్పడే బ్లడ్ ప్రెజర్ శిశువు ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం పడకుండా రక్షణ కల్పిస్తుంది. చివరగా, కార్న్ ఫ్లేక్స్ గర్భిణీల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బాడీ వెయిట్ ను మెయింటైన్ చేయడానికి గొప్పగా సహాయపడుతుంది. కడుపులో పెరిగే శిశువు వల్ల తల్లిలో వచ్చే బరువు మార్పలను స్థిరంగా ఉంచుతుంది. కార్న్ ఫ్లేక్స్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల అధికంగా డైటరీ ఫైబర్ ఉండటం వల్ల మీ పొట్టను ఫుల్ గా ఉంచుతుంది.దాంతో గర్భిణీల ఆకలి కోరికలను కంట్రోల్ చేస్తుంది.


No comments:

Post a Comment