తల్లిగా బాధ్యతలు నిర్వహించడం, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం ఈ రెండు పనులను
ఒకే తాటిపై నడిపించడం సులువు కాకపోయినా, రొటీన్‌లో
చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సంతోషంగా ఉండగలుగుతారు.
బిడ్డ పుట్టిన తర్వాత ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం అంత సులువైన పని కాదు. ఒక పక్క బాస్‌కి కోపం రాకుండా చూసుకోవాలి. ఇంకో పక్క కుటుంబ సభ్యుల, పిల్లల అవసరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. సరికొత గణాంకాల ప్రకారం 43 శాతం పనిచేసే తల్లులు జీతం నష్టం మీద శలవలు తీసుకుంటున్నారు. మీరు కూడా ఆ 43 శాతంలో ఒకరు కాకుండా ఉండాలంటే ఈ సలహాలు పాటించి చూడండి.
పనిలో మార్పులు చేసుకోవాలి
ఇప్పుడు చాలా కంపెనీలు, పనిచేసే తల్లుల అవసరాలను పరిగణనలోనికి తీసుకుంటున్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వారికి వెంటనే శలవు ఇచ్చే వీలు కల్పిస్తున్నాయి. కంపెనీలు కల్పించే ఇంకో అవకాశం, ఇంటినుంచి పనిచేయడం.ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, పిల్లలకి స్కూలు శలవున్నరోజున బాస్‌ని అడిగి ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇమ్మని అడగచ్చు.
ఇంటిపని రాత్రే ముగించాలి
రాత్రిపూటే వంటగదిలో పనులు పూర్తి చేసుకుని, తర్వాతి రోజుకు అవసరమైనవి సిద్ధం చేసుకోవడం వలన ఆఫీసు పని, ఇంటి పని రెంటినీ నియంత్రించుకోవడం సులువవుతుంది. ఒక క్రమబద్ధమైన జీవనశైలి మీతో పాటు పిల్లలకు కూడా అలవాటు చేయాలి.దానితో పని సులువవుతుంది. ఆఫీసు పని, ఇంటిపని తర్వాత పిల్లలకోసం ప్రత్యేకంగా ఒక గంట సమయాన్ని కేటాయించాలి. వారితో కలిసి కార్టూన్లు చూడాలి, వారికి నచ్చిన ఆటలు ఆడాలి. అలా చేస్తే, మీరు ఆఫీసు, ఇంటి పనిలో పడి వారికి దూరం అయ్యామన్న బెంగ అనిపించదు.
ఫోన్‌లో టచ్‌లో ఉండాలి
పిల్లలను డే కేర్ సెంటర్లో వదిలి పెట్టాల్సి వచ్చినప్పుడు, అక్కడి సంరక్షకులతో, లేక టీచర్‌తో ఎప్పుడూ ఫోన్ ద్వారా టచ్‌లో ఉండాలి. పిల్లలు అక్కడ ఎలా ఉంటున్నారో, వారి అభివృద్ధి ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి. అక్కడేపిల్లలు సురక్షితంగా ఉన్నారని నిశ్చింతగా ఉండచ్చు. ఇంకా కొన్ని ఐటీ కంపెనీలు, మహిళా ఉద్యోగుల పిల్లల కోసం డేకేర్ సెంటర్లను సూచిస్తున్నాయి. వారు ఆఫీసులో ఉండే పిల్లలను వీడియోలో చూసుకునే సౌలభ్యం వీటి వల్లఉంటుంది.
కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయండి
ప్రతిరోజూ ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్‌ఫాస్ట్, రాత్రి భోజనం కలిసి చేసేటట్టు ప్లాన్ చేయచ్చు.
ఇంట్లో ఉన్న సమయం అంతా వంటగదిలో గడిపేయకుండా కుటుంబ సభ్యులతోనూ, పిల్లలతోనూ కొంత సమయం గడిపితే దగ్గరితనం పెరుగుతుంది. వారిని కూడా వారి స్నేహితుల గురించి, స్కూలు గురించి చెప్పమని అడిగి తెలుసుకోవాలి.
కలిసి బయటకు వెళ్ళండి
పిల్లలకు మాల్స్‌కు వెళ్ళడం సరదా. వంటింటి సరుకులు తేవడానికి వెళ్ళినా వారిని మీతోపాటు తీసుకు వెళ్ళి సరుకులు ఎంచుకుని బాస్కెట్‌లో వేయడంలో సహాయం చేయమని చెప్పాలి.

No comments:
Post a Comment