Wednesday, March 19, 2014

పాలిచ్చే తల్లులు తినాల్సిన ఆహారాలు...

బేబీకి పాలు పట్టడం అనేది ఒక ప్రధానమైన పని. శిశువు కడుపులో ఉన్నప్పుడు మాత్రమే కాదు, పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలలు తల్లితీసుకొనే న్యూట్రీషియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, కొత్తగా తల్లైన వారు, ముఖ్యంగా పిల్లలకు తల్లిపాలను పట్టే వారు, తినే ఆహారం మీద తగినంత శ్రద్ద కలిగి ఉండాలి. బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో మీరు ఏమి తినాలి, ఎటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి, సంప్రధాయ, అలాగే ఆధునికంగా విరుద్ద సలహాలు టన్నుల్లో కనుగొన్నారు. మరియు పెద్దలు చెప్పడం వింటూనే ఉంటారు. కానీ అత్యంత ముఖ్యమైన విషయం ఈ దశలో మీ శరీరంకు కావల్సిన పోషకాంశాలను అందివ్వడంలో ఏమాత్రం రాజీ పడకండి. తల్లి ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ ద్వారా మీ శిశువు పూర్తి పోషకాలను పొందుతారు కాబట్టి, పాలిచ్చే తల్లులు పోషకాంశాలు అధికంగా ఉండే ఆహారాలనే ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఆహారాలు తల్లిలో పాలు పడటంతో పాటు, తల్లి, బిడ్డకు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. శిశువుకు పాలు పట్టే తల్లులు స్పెషల్ డైట్ అంటూ ఏమి ఉండదు. అయితే, మీరు తీసుకొనే ఆహారాల్లో, పాలిచ్చే తల్లిలో పాలు ఉత్పత్తికి సహాయపడే అధనపు క్యాలరీలను అంధించే, తక్కువ కారం ఉన్నఆహారాలను తీసుకోవాలి. పాలిచ్చే తల్లులు కారంగా ఉన్న ఆహారాలను నివారించడం ఉత్తమం. ఎందుకంటే, అదినేరుగా పిల్లల మీద ప్రభావం చూపుతుంది. అది పిల్లల్లో జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఈక్రింది స్లైడ్ లో తెలిపిన ఆహారాలను పరిశీలించి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులు వీటిని తీసుకోవడం ఉత్తమం.
వెజిటేబుల్స్ బేబీకి పాలు పట్టే సమయంలో వెజిటేబుల్స్ ఒక ఉత్తమ ఎంపిక. వెజిటేబుల్స్ లో ముఖ్యంగా బ్రొకోలీ, బెల్ పెప్పర్, స్వ్కాష్ మరియు బీన్స్ వంటివి, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కు బెస్ట్ డైట్ ఆఫ్షన్స్.

 

No comments:

Post a Comment