Tuesday, March 18, 2014

డార్క్ స్పాట్స్ నివారించే ఎఫెక్టివ్ బ్యూటీ టిప్స్

డార్క్ స్పాట్స్(చర్మం మీద నల్ల మచ్చలు)చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. డార్క్ స్పాట్స్ కు ముఖ్య కారణం మొటిమలు మరియు మచ్చలు వీటి ద్వారానే చర్మం మీద అనేక మచ్చలు ఏర్పడుతుంటాయి. డార్క్ స్పాట్స్ ఏర్పడిన తర్వాత అంత సులభంగా తొలగిపోవు. డార్క్ స్పాట్స్ లో అధికంగా మెలనిన్ ఉండటం వల్ల ముఖంను నల్లగా మార్చేస్తాయి. డార్క్ స్పాట్స్ అపక్రమమైన చారలను, మచ్చలను చర్మం మీద ఏర్పరుస్తుంది. ఫలితంగా చర్మం డల్ గా మరియు నిర్జీవంగా కనబడుతుంది . ఈ డార్క్ స్పాట్స్ చెడు లైఫ్ స్టైల్, మరియు ఆహారపు అలవాట్లు, దుమ్మ మరియు ధూళి, కాలుష్యం, హార్మోనుల ప్రభావం మరియు మొటిమలు, మచ్చలు ఇవన్నీకూడా డార్క్ స్పాట్స్ కు కారణం అవుతాయి. ఈ కారణాల వల్ల ఏర్పడ్డ డార్క్ స్పాట్స్ నివారించడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల, ఈ డార్క్ స్పాట్స్ ను నివారించడానికి కొన్ని బ్యూటీ టిప్స్ ను అనుసరించాలి. ఈ ఆర్టికల్లో కొన్ని నేచురల్ డార్క్ స్పాట్స్ బ్యూటీ టిప్స్ గురించి వివరించడం జరిగింది. ఈ చిట్కాల వల్ల డార్క్ స్పాట్స్ ను శాశ్వతంగా నివారించవచ్చు . దాంతో చర్మం ప్రకాశవంతంగా మరియు అందంగా మార్చుకోవచ్చు. ఈ డార్క్ స్పాట్స్ బ్యూటీ టిప్స్ ద్వారా చర్మం కాంతిని మెరుగుపరుచుకోవచ్చు. ఎటువంటి, మచ్చలు, మొటిమలు లేని ప్రకాశవంతమైన చర్మం ఛాయను పొందడానికి ఈ చిట్కాలను రెగ్యులర్ గా అనుసరించండి...
తేనె తేనె చర్మాన్ని స్మూత్ గా మార్చడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది చర్మంలో దుమ్ము, ధూళి, మలినాలను తొలగిస్తుంది. చర్మాన్ని క్లియర్ గా చేస్తుంది. మరియు చర్మ కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. దాంతో పాత చర్మకణాలను నివారించబడి, కొత్త చర్మకణాలు ఏర్పడుట వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతే కాదు, నల్లమచ్చలు, మొటిమలు నివారించి చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుతుంది. అందువల్ల, డార్క్ స్పాట్స్ నివారించడానికి తేనెను రెగ్యులర్ గా ఉపయోగించడం మంచిది.

No comments:

Post a Comment