ప్రసవం అనేది అపారమైన సంతోషాన్నిమరియు ఆనందం తల్లిదండ్రుల జీవితంలో
నింపుతుంది. ఒక తల్లిదండ్రులుగా, మనం అందరం కూడా మన పిల్లల యొక్క మొదటి
పుట్టిన రోజును జరపుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. ఈ అందమైన క్షణాలు
ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంచుకోవడానికి పిల్లల పుట్టిన రోజును చాలా గ్రాండ్ గా
జరుపుకుంటారు. పిల్లల యొక్క మొదటి పుట్టిన రోజు ఒక అద్భుతమైన కేక్ ,
బహుమతులు , మరియు కుటుంబానికి చాలా దగ్గర స్నేహితులు, అతిథులతో నిండి ఉండే
ఒక సందర్భంగా ఉంటుంది. ఈ సమయంలోని సంతోషాలను పంచుకోవడానికి మిస్ చేయకూడదు.
మీ యపిల్లలు మొదటి సంవత్సరంలోకి మారినప్పుడు, అది ఒక మైలురాయిగా ఉంటుంది,
మరియు ఈ పుట్టిన రోజుకు ప్రధాన ప్రాధన్యత ఇస్తారు. ముందు ముందు ఇంకా అనేక
పుట్టిన రోజులు చేయాల్సిన ఆలోచనలున్నా, మొదటి పుట్టిన రోజుకు ఎక్కువ
ప్రాధాన్యత ఇస్తారు. ఈ యంగర్ జనరేషన్ లో బర్త్ డే థీమ్స్ బారీ హిట్స్ .ఇది
మీ చిన్నపిల్లలకు గుర్తు ఉండకపోవచ్చు, అది మీ వరకూ మొదటి బర్త్ డే
ప్రతిష్టాత్మకంగా చేయవచ్చు.
మీ పిల్లల కోసం మొదటి బర్త్ డేను ప్లాన్ చేసేటప్పుడు, ఇప్పటికే మీరు కొన్ని
బర్త్ డే ప్లాన్స్ మొదలు పెట్టి ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే, మీరు
కొన్ని సాధారణ చిట్కాలు, ట్రిక్స్ మరియు టెక్నిక్స్ ఉపయోగిస్తే ఎక్కడైన,
ఎప్పుడైనా అది కొన్నిఅద్భుతాలు చేస్తుంది.
మీ పిల్లల బర్త్ డే పార్టి మరింత గ్రాండ్
గా జరపడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు మీకోసం ...
మీ పిల్లల యొక్క మొదటి పుట్టిన రోజు కోసంఐడియాస్
పార్టి ఎక్కడ:
మొదటి పుట్టిన రోజు ఎల్లప్పుడు ఒక అద్భుతమైన వ్యవహారం. మీరు ఇంట్లో ఒక
సాధారణ పార్టీతో వెళ్ళి లేదా సందర్భంగా జరుపుకునేందుకు ఒక వేదిక బుక్
చేయవచ్చు . అలాగే బహుమతులను ఇంటికి తీసుకునిరావడానికి రవాణా ఏర్పాట్లు
చేసుకోండి.
ప్రత్యేకమైన కేక్: ఇది మీ పిల్లల యొక్క మొదటి బర్త్ డే పార్టీ అయినప్పుడు,
ఒక అద్భుతమైన కేక్ లేకపోతే అసంపూర్తిగా ఉంటుంది. అవును, అందుకు మీరు ఒక హోం
మేడ్ కేక్ ను తయారుచేయడం లేదా సందర్భానికి తగినట్లు, బేకరీలో ఆర్డర్ ఇచ్చి
తయారుచేయించవచ్చు.
ఒక థీమ్ ఎంచుకోండి
కిడ్స్ కు కార్టూన్లు అంటే ఎక్కువ ఇష్టం! మీరు ఒక కార్టూన్ థీమ్ లేదా మీ
కిడ్స్ కు ఇష్టమైన థీమ్ ను ఎంపికచేసుకోండి. థీమ్ బేస్డ్ కోసం మీరు జంతువులు
, స్టఫ్డ్ బొమ్మలు మరియు ఆహార ఆధారంగా ఒక థీమ్ నిర్మించవచ్చు .
గెస్ట్ జాబితా
మీ పిల్లల యొక్క మొదటి బర్త్ డే పార్టీకి అధికంగా జనాలు రావడం వల్ల మీ
పిల్లలు విసుగు చెందవచ్చు, లేదా భయపడవచ్చు. తెలివిగా ప్లాన్ చేసుకోండి
మరియు మీ కుటుంబానికి దగ్గరగా ఉన్నవారిని ఆహ్వానించండి. అతిథి జాబితాను
మెజారిటీ పిల్లలు కలిగి ఉండాలని నిర్ధారించుకోండి .
ఆటలు ఆటించండి:
ఈ ఉత్సాహవంతమైన ఇటువంటి ప్రత్యేకమైన సందర్భాన్ని ఫోటోల్లో బంధించాలి, ఇది
మీ పిల్లలు సంతోషకరమైన క్షణాలను ఫోటోల్లో బంధించడం వల్ల ఎప్పుడైన చూడవచ్చు.
పార్టీ సామాగ్రి
మీ పిల్లల యొక్క మొదటి పుట్టిన రోజు చిరస్మరణీయ చేయడానికి, బ్యానర్లు ,
బెలూన్స్ , చిహ్నాలు , నేపథ్య napkins మరియు ఇతర అలంకరణలు వస్తువులను
సరఫారా చేయాలి. అలాగే మీరు ప్లేట్లు మరియు పరిపోయే పాత్రలను తీసుకెళ్లండి
లేదా ఆర్డర్ చేయండి.
పేపర్ మెను: మీ పిల్లల మొదటి బర్త్ డే పార్టీకి మీరు ప్లాన్ చేయడానికి
ముందు, మీ పిల్లల యొక్క మొదటి బర్త్ డే పార్టికి మెను నిర్ధారించుకోండి.
ఎటువంటి ఫుడ్ మరియు వెజిటేరియన్ లేదా నాన్ వెజిటేరియన్ , ఎటువంటి డ్రింక్
ఎంపిక చేసుకోవాలి.
బహుమతులు: బహుమతులు లేకుండా పుట్టినరోజు పార్టీలు అసంపూర్తిగా ఉంటుంది.
మీరు మీ పిల్లలకు ఎటువంటి బహుమతులు తీసుకురావాలో మీ అతిథులకు ముందే
చెప్పండి . పార్టీథీమ్ కు సరిపడే బహుమతులను తీసుకురమ్మని చెప్పండి.

No comments:
Post a Comment