అనేక మంది తల్లిదండ్రులు వారి బిడ్డల కోసం డిస్పోజబుల్ డైపర్ లను
సులభంగా ఉపయోగించటం చూస్తున్నాము. అత్యధిక శోషణ గుణం గల డైపర్స్
ఉపయోగించడం వలన బయటకు వెళ్ళిన సమయంలో మరియు రాత్రి సమయంలో చాలా ప్రశాంతంగా
ఉండవచ్చు. కానీ ఈ డైపర్స్ తో ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా
ఉన్నాయి. అత్యధిక శోషణ గుణం గల డిస్పోజబుల్ డైపర్స్ ఉపయోగించే పిల్లలకు
డైపర్ రాష్ అనేది చాలా సాధారణ సమస్యగా ఉన్నది. సాధారణంగా డైపర్ ఉపయోగించే
పిల్లలకు తరచుగా డైపర్ దద్దుర్లు ఏర్పడతాయి.
డైపర్ రాష్ మంటను తగ్గించటానికి సహజ నివారణలను ఉపయోగించి ఉత్తమ చికిత్సలను
ఎంపిక చేసుకోవాలి. డైపర్ రాష్ చికిత్స ప్రారంభంలోనే నిరోధించటం చాలా
ముఖ్యం. ఎందుకంటే అంటువ్యాధులు మరియు వాపుల వంటి సమస్యలకు దారి తీయవచ్చు.
ఇటువంటి పరిస్థితిలో మూత్రం మరియు మలం స్థిరంగా లేక అధ్వాన్నంగా మారుతుంది.
ఇక్కడ ఈ చర్మం తక్కువ రక్షణ నూనెలను ఉత్పత్తి చేస్తుంది. అందువలన
ఇన్ఫెక్షన్ల వంటి వాటి మీద తక్కువ ప్రభావవంతమైన అవరోధం కలిగిస్తుంది. మీ
శిశువు డైపర్ రాష్ పొందినప్పుడు,ఆ ప్రాంతంలో పొడిగా ఉంచుకోవడం అనేది మీరు
గుర్తుంచుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం.
డైపర్ రాష్ మంట మరియు మీ శిశువు యొక్క సున్నితమైన చర్మం కొరకు సహజ
నివారణలు ఉత్తమ ఎంపికలుగా ఉన్నాయి. కృత్రిమ ఉత్పత్తులు మీ శిశువు చర్మంను
చికాకుపరచవచ్చు. ఇక్కడ డైపర్ రాష్ మంట కోసం కొన్ని సమర్థవంతంగా పనిచేసే
సహజ నివారణలు ఉన్నాయి. నాపి రాష్ తగ్గటానికి మరియు పుండ్లు ఉపశమనానికి
సహాయం చేయడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి.

No comments:
Post a Comment