Friday, January 3, 2014

గర్భిణీలో చెమట,వాసనను తగ్గించే చిట్కాలు

శరీరం నుండి వాసన వస్తే మాత్రం చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలు అధికంగా చెమట సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇది చాలా సాధారణ సమస్య, ఈ సమస్యకు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది మహిళలు ఎక్కువ చెమట సమస్యతో బాధపడుతూ, ఫెర్యూమ్స్ ను లేదా డియోడరెంట్స్ ను ఉపయోగిస్తుంటారు. ఈ సమస్య గర్భిలో ఏర్పడే హార్మోనుల మార్పుల వల్ల జరుగుతుంది. ఈ నేచురల్ సమస్య గర్భధారణ సమయంలో గర్భిణీ తీసుకొనే అధనపు ఆహారం లేదా మందుల వల్ల కూడా వస్తుంది. గర్భధారణ సమయంలో కొన్ని హోం రెమెడీస్ శరీరం నుండి వచ్చే దుర్వాసను, చెమట వాసనను నివారిస్తుంది. ఉదా: గర్భిణీ స్త్రీలు స్నానం చేసే టప్పుడు, బేకింగ్ సోడా ఉపయోగించే చక్కల్లో రుద్ది స్నానం చేయడం వల్ల, వాసన రాదు, మరియు ఫ్రెష్ గా ఉంటారు. గర్భణీ స్త్రీలు చెమట, వాసనను నివారించే మరికొన్ని చిట్కాలు మీకోసం.... గర్భధారణలో చెమట, దుర్వాసన నివారించే హోం రెమెడీస్ 
 1. గర్భధారణ సమయంలో బాత్ టబ్ లేదా స్నానం చేసే నీటిలో నిమ్మరసం మిక్స్ చేయం ఒక బెస్ట్ హోం రెమెడీ. ఈ నీటితో స్నానం చేయడం వల్ల రోజంతా మీ శరీరం మంచి సువాసన కలిగి ఉంటుంది.. 
2. బేకింగ్ సోడా పేస్ట్ తో చంకల్లో రుద్దుకోవాలి లేదా తుడవాలి. బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు పోసి, పేస్ట్ లా చేసి, కాటన్ బాల్ సహాయంతో చక్కల్లో తుడుచుకోవాలి. 
3. గర్భదారణ సమయంలో శరీర దుర్వాసనను నివారించడానికి కార్న్ స్ట్రార్చ్ పౌడర్ బాగా సహాయపడుతుంది. కార్న్ స్ట్రార్చ్ పౌడర్ ను మీరు స్నానం చేసే టప్పుడు , స్నానం చేసే నీటిలో మిక్స్ చేయాలి. 
4. మీ చంకలను, భుజాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చంకల్లో హెయిర్ ఉండవల్ల అక్కడ బ్యాక్టీరియా మరియు క్రిములు చేరి, దుర్వాసనకు కారణం అవుతాయి. కాబట్టి, చంకలను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. 
5. పలుచగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. కాటన్ దుస్తులు చెమటను చాలా తేలికగా పీల్చుకుంటాయి. పాలిస్టర్ మరియు సిల్క్ వంటివి చెమటను మరింత పెంచుతాయి కాబట్టి గర్భధారణ సమయంలో వీటికి దూరంగా ఉండండి. 
6. పసుపులో యాంటీ బ్యాక్టీరియన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు బాడీ ఆడర్ ను తగ్గిస్తుంది. 
7. నిద్రించడానికి ముందు చంకల్లో వేపనూనెను అప్లై చేయాలి. గర్భదారణ సమంలో దుర్వాసన నివారిచండానికి ఈ యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఈ నూనె బాగా సహాపడుతుంది. 
8. ఎక్కువగా నీళ్ళు త్రాగుతూ , శరీరాన్ని ఎల్లప్పుడు హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. దాంతో చెమట పట్టకుండా ఉంటుంది.

No comments:

Post a Comment