Thursday, January 2, 2014

3నెలల గర్భిణీలో మార్పులు..!

గర్భధారణ సమయంలో మూడు త్రైమాసికాలు ఉంటాయి. ప్రతి ఒక్కత్రైమాసికం చాలా ముఖ్యమైనది. మరియు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో మూడవ నెల నుండి బేబీ బంప్(పొట్ట)నిదానంగా బయట వైపుకు పెరగడం మొదవలువుతుంది. మరియు చాలా మందిలో మూడవ నెలనుండే పొట్ట కనబడటం జరుగుతుంది. మూడవ నెల ప్రారంభం కాగానే చాలా మంది గర్భిణీ స్త్రీలలో మార్నింగ్ సిక్ నెస్, మరియు అలసట అనేవి తగ్గుతుంది. మూడవ నెల గర్భధారణ సమయంలో ఇంకా కొన్ని విషయాలను మనం గమనించవచ్చు. అలాగే మూడవ నెల గర్భధారణ సమయంలో కొన్ని సందర్భాల్లో గర్భస్రావం జరిగే అవకాశం కూడా ఉంది . అందువల్ల, గర్భిణీకి మూడవ నెల రాగానే, ఆమె అదనపు జాగ్రత్తలు మరియు శ్రద్ద తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, మూడవ నెలకు చేరుకోగానే మీరు చేయాల్సిన పనులు కొన్ని క్రింది విధంగా ఉన్నాయి. వాటిని పరిశీలించండి... 3నెలల గర్భిణీ: తెలుసుకోవల్సిన విషయాలు శిశువు పెరుగుదల: కడుపులో శిశువు క్రమంగా పెరగడం మొదలవుతుంది మరియు స్కానింగ్ లో బిడ్డ యొక్క ముఖం క్లియర్ గా కనడటం తెలుస్తుంది . కళ్ళు, మరియు చెవులు ఆకారం పొందడాన్ని స్కానింగ్ ద్వారా చూడవచ్చు . లాలాజల గ్రంధులు, కాలేయం, మరియు స్వర కూడా నిర్మించడం మొదలవుతుంది. అలాగే మెదడు మరియు గుండె కూడా 3వ నెల నుండి అభివృద్ధి చెందుతుంది. మీరు 3 నెలల గర్భవతి ఉన్నప్పుడు, పెరుగుతున్న పిండం కండరాలు నరము ప్రచోదనాలను స్పందించడం ప్రారంభమవుతుంది. సెకెండ్ స్కాన్: గర్భిణీ స్త్రీ తన మూడవ మాసం గర్భాధారణ సమయంలో తన రెండవ ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మొదటి స్కాన్ 8వారాలప్పుడు తీసి ఉంటారు. ఈ ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ ను మీ డాక్టర్ తీస్తారు. మీరు 10-16వారాల ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బేబీ యొక్క చేతులు, కాళ్ళు, పాదాలు మరియు ముఖంను చూడగలరు. వికారం: మూడు నెలల గర్భిణీ స్త్రీలో, వికారం తగ్గవచ్చు లేదా అలాగే కొనసాగవచ్చు!అటువంటి పరిస్థితిలో అల్లం మరియు సిట్రస్ పండ్ల వాసనను వంటి కొన్ని హోం రెమెడీస్ ను అనుసరించి వికారం నుండి ఉపశమనం పొందవచ్చు. మూడవ నెల చివరి దశలో హార్మోనుల సమతుల్యం చెందడం వల్ల వికారం పూర్తిగా తగ్గుముకం పడుతుంది. తలనొప్పి: గర్భాధారణ సమయంలో ప్రతి యొక్క గర్భిణీ స్త్రీ ఎదుర్కొనే సమస్య తలనొప్పి. ఈ తలనొప్పి చాలా మందిలో గర్భధారణ పూర్తికాలం ఉంటుంది. అందువల్ల, మీరు మూడవ నెల గర్భధారణ సమయంలో, హార్మోనుల అసమతుల్యత వల్ల మరియు రక్త ప్రవాహం పెరుగడం వల్ల తలనొప్పి పెరుగుతుంది. అటువంటి సమయంలో తలనొప్పి నివారణకు మాత్రలు మ్రింగడానికి బదులు, కొన్ని హోం రెమెడీస్ అంటే హెర్బల్ టీ త్రాగడం లేదా తగినంత విశ్రాంతి మరియు తగినంత నిద్రను పొందాలి. 3వ నెల గర్భధారణ జాగ్రత్తలు: గర్భిణీ మూడవ నెల గర్భిణీగా ఉన్నప్పుడు, ఆమె శరీరం గురించి కూడా తగినంత జాగ్రత్త తీసుకోవాలి. గర్భిణీలో మలబద్దకం, తరచూ మూత్రవిసర్జన, కడుపు ఉబ్బరం మరియు డెంటల్ ఇన్ఫెక్షన్స్, వంటివి గర్భిణీలో ఎదురయ్యే సాధారణ సమస్యలు. అలాగే 3వ నెల గర్భధారణ సమయంలో వికారం కూడా ఉంటుంది. అటువంటి వారు, నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వైపుకు తిరిగి పడుకోవాలి: మహిళ గర్భదారణ సమయంలో, నిద్రించే భంగిమ మీద శ్రద్ద పెట్టాలి. గర్భిణీ స్త్రీ, వెళ్ళకిలా లేదా బెల్లీ వైపు కాకుండా తన ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది.

No comments:

Post a Comment