Thursday, November 7, 2013

తెల్లటి దంతాలు

నవ్వినప్పుడు ఆరోగ్యకరమైన, తెల్లటి దంతాలు కనిపిస్తే ఆ దరహాసానికి మరింత అందం చేకూరుతుంది. మరి దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలంటే...
రోజూ ఇలా చేసి చూడండి.- రోజుకు రెండుసార్లు తప్పక బ్రష్‌ చేసుకోవాలి. ఏదైనా తీపి పదార్థం తిన్న వెంటనే నోరు పుక్కిలించుకోవడం మరచిపోకూడదు.
- ఎసిడిక్‌ ఆహారం తిన్న వెంటనే బ్రష్‌ చేయకూడదు. అలా చేస్తే పంటి ఎనామిల్‌ పోయే అవకాశం ఉంది.
- పళ్ళు తోముకున్న ప్రతిసారి నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి.
- పుల్లటి రసాలు, సోడా వంటివి తాగడానికి స్ట్రా ఉపయోగించాలి. దాని వలన పళ్ళు పాడవకుండా ఉంటాయి. అయినా తినిన, తాగిన వెంటనే యోరు పుక్కిలిస్తే మంచిది. 
- ఎక్కువ రోజులు ఒకే టూత్‌ బ్రష్‌ వాడటం మంచిది కాదు. ప్రతి మూడు నెలలకొకసారి కొత్త బ్రష్‌ మార్చడం మంచిది.
- కార్బొనేటెడ్‌ శీతల పానీయాలలో చక్కెర శాతం ఉంటుంది. అది పళ్ళకు హాని కలిగిస్తుంది.
- పొగ తాగడం వలన క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాక పళ్ళు రంగు మారిపోయి ఆకర్షణ కోల్పోతాయి. 
- ఆల్కహాల్‌ సంబంధిత పానీయాలు అలవాటుగా తాగితే పళ్ళు ఊడిపోయే ప్రమాదముంది. 
- పళ్ళు సలుపులు, చిగుళ్ళ నుండి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. 
-సమస్య ఉన్నా లేకపోయినా ప్రతి ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా దంత వైద్యుని వద్దకు వెళ్ళి, పరీక్ష చేయించుకోవాలి.

No comments:

Post a Comment