ప్రముఖ సినీ ఆర్టిస్టు.. హాస్య నటుడు ఎవిఎస్ ఈ
శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి
విషమంగా
ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాలేయానికి ఇన్ ఫెక్షన్ సోకడంతో చికిత్స చేయలేమని, పరిస్ధితి చేయి దాటిపోయిందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటిలేషన్ పై ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎవిఎస్ ఆరోగ్య పరిస్ధితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఎవిఎస్ పదిరోజుల కిత్రమే హైదరాబాద్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయినట్లు గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. ఎవిఎస్ గత నాలుగు ఏళ్ల కిత్రమే కాలేయ మార్పిడి చేసుకున్నాడు. అయినా ఆ వ్యాధి మళ్లీ ముదిరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎవిఎస్ ఈ శుక్రవారం విడుదలయిన 'నేనేం చిన్న పిల్లనా' చిత్రంతో పాటు పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

No comments:
Post a Comment