సమగ్రమైన చర్మ సంరక్షణకు విటమిన్ 'ఇ' అత్యంత కీలకమైనదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకప్పుడు చర్మ సంరక్షణ కోసం 'ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్' (ఏ.హెచ్.ఏ.లు) ముఖ్యమని భావించేవారు. అయితే, ఇప్పుడు ఒంటి మీద
రాసుకొనే విధానంలో విటమిన్ 'ఇ'ను మించినది లేదని కనుగొన్నారు. ఇలా చర్మానికి రాసుకొనే విటమిన్లను 'టాపికల్ విటమిన్లు' అంటూ ఉంటారు. నిజానికి, 1960ల ప్రాంతంలోనే ఈ రకమైన టాపికన్ విటమిన్లను అందం, ఆరోగ్య సంరక్షణ రంగంలో వినియోగించడం మొదలుపెట్టారు. వాటి సామర్థ్యాన్ని ఏళ్ళ తరబడిగా అధ్యయనం చేశారు. ఇలా ఒంటి మీద విటమిన్లను రాయడం వల్ల కణజాలాలు పునరుత్తేజం పొందుతాయనీ, చర్మానికి కలిగే నష్టం నివారించవచ్చనీ 1980లలోనే తేలింది.
చర్మంలో మూడు ప్రధానమైన పొరలుంటాయి - ఎపిడెర్మిస్ (పై చర్మం), డెర్మిస్, హైపో డెర్మిస్ (లోపలి చర్మపు పొర). సాధారణంగా మన వయస్సు పెరిగే కొద్దీ, చర్మ కణజాలం పునరుత్తేజం పొందడం తగ్గిపోతుంది. ఫలితంగా, చర్మం పొడిబారుతుంది. గరుకుగా మారుతుంది. చర్మం పాడవుతుంది. ముడతలు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో నష్టాన్ని నిరోధించి, మళ్ళీ ఒంటి పై చర్మాన్ని బాగు చేయడానికీ, అలాగే కణజాలం స్థాయిలో పని చేయడానికీ విటమిన్ 'ఇ' ఉపకరిస్తుంది.
నిత్యం మనం వాతావరణంలోని అనేక విషతుల్య పదార్థాల బారిన పడుతుంటాం. ఈ పరిస్థితుల్లో చర్మాన్ని మృదువుగా, కోమలంగా ఉంచడానికి విటమిన్ 'ఇ' ఎంతో ఉపయోగపడుతుంది. అత్యంత శక్తిమంతమైన, సహజమైన యాంటీ ఆక్సిడెంట్ - విటమిన్ 'ఇ'. చర్మంలోని సహజమైన రక్షణ వ్యవస్థలను పెంచడానికి కూడా అది తోడ్పడుతుంది. టాపికల్ విటమిన్ 'ఇ'ను గనక ఒంటి పై చర్మానికి రాస్తే, అది చర్మ పోషణకు సహకరిస్తుంది. దురద బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే, చర్మంలో తేమ ఉండేలా చూస్తుంది. దాంతో, చర్మం మృదువుగా, నిగారింపుతో ఉంటుంది.
పౌష్టికాహారంతో చర్మ సంరక్షణ
సమగ్రమైన చర్మ సంరక్షణకు మనం తినే ఆహారం, ఆరోగ్యవంతమైన జీవనశైలి సైతం ముఖ్యం. రంగు రంగుల పండ్లు, కూరగాయలు తింటే చర్మంతో పాటు, శరీరం మొత్తానికీ కావాల్సిన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. దానితో పాటు రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేస్తే, శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం శ్వాసప్రక్రియ మెరుగవుతుంది. అలాగే, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రోజూ కనీసం ఏడు నుంచి 8 గంటల పాటు గాఢంగా నిద్ర పోవాలి. దీని వల్ల చర్మం త్వరగా వృద్ధాప్య లక్షణాలను సంతరించుకోదు. కాబట్టి, సంతులితమైన ఆహారం తీసుకోవడం, పోషక విలువలున్న ఇతర పదార్థాలు తినడానికి మించింది లేదు.
చర్మ సంరక్షణ కోసమని విడిగా మాయిశ్చరైజర్లు వాడేవారు ఆ యా భాగాల చర్మానికి తగ్గది ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖానికి రాసుకొనే మాయిశ్చరైటర్ తొందరగా ఒంట్లోకి ఇంకేది అయ్యుండాలి. ఇక, చేతులు తరచూ కడుక్కొంటూ ఉంటాం, పైగా చేతులు ఎక్కువగా ఎండ బారిన పడుతుంటాయి. అందువల్ల వాటిలో తేమ బాగా తగ్గిపోతుంది. వాటిని సంరక్షించుకొనేందుకు విటమిన్ 'ఇ'తో కూడిన మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయడం మంచిది. మొత్తం మీద చర్మ సంరక్షణకు కావాల్సిన తేమ తగ్గిపోకుండా, చర్మ కణజాలం పునరుత్తేజం పొందేలా చూడడంలో విటమిన్ 'ఇ' కీలకమని గుర్తుంచుకోవాలి. సంతులిత ఆహారం, కూరగాయలు తీసుకుంటూ, హాయిగా కంటి నిండా నిద్రపోతే అదే మన చర్మానికి పెట్టని కవచం!

No comments:
Post a Comment