ఈ సీజన్ లో మనకు కావల్సినన్ని గ్రీన్ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటాయి. అంతే
కాదు మనం తీసుకొనే భోజనంతో ఈ గ్రీన్ వెజిటేబుల్స్ సంపూర్ణంగా పూర్తి
చేస్తాయి. ముఖ్యంగా లెట్యూస్, క్యాబేజ్, కాలీఫ్లవర్ మరియు ఆకుకూరలు ఈ సీజన్
లో అందుబాటులో ఉంటాయి. ఆకుకూరలతో వివిధ రకాల సైడ్ డిష్ లను
తయారుచేస్తుంటారు.
ఆకుకూరలను ఒక సూపర్ ఫుడ్ గా చెబుతుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది
మరియు మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాంశాలను అంధిస్తుంది. మీరు
మాంసాహారులైతే, అప్పుడు మీ టేస్ట్ బడ్స్ కు ఒక అద్భుతమైన రుచికరమైన పాలక్
చికెన్ ఒక బెస్ట్ ట్రీట్ .పాలక్ చికెన్ అల్లం, వెల్లుల్లి, నిమ్మ రసంతో
మ్యారినేట్ చేసి, పాలక్ పేస్ట్ తో ఫ్రై చేస్తే చాలా అద్భుంతగా ఉంటుంది.
మీరు కూడా ఈ పాలక్ చికెన్ టేస్ట్ చేయాలంటే, తయారుచేసే పద్దతిని మరియు
అందుకు కాల్సిన వస్తువులను క్రిందిగా విధంగా ఫాలో అవ్వాల్సిందే...
చికెన్: 250gms(ఎముకలు లేనివి మరియు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పాలక్: 500grms(ఉడికించినవి)
అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్: 2tsp
ఉల్లిపాయ: 2
పెరుగు: 1tbsp
పచ్చిమిరపకాయలు: 3- 4
పసుపు: 1tsp
ధనియాల పొడి: 1tsp
పంచదార : ఒక చిటికెడు
నిమ్మరసం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
జీలకర్ర: 1tsp
బిర్యానీ ఆకు: 1
తాజా క్రీమ్: 1tsp(గార్నిషింగ్ కోసం)
తయారుచేయు విధానం:
1.ముందుగా చికెన్ ముక్కలను ఉప్పు, నిమ్మరసం మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్
తో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాలకు మరియు పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో జీలకర్ర మరియు
బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి.
5. అందులోనే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి మీడియం మంట మీద వేగించుకోవలి.
6. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకూ వేగించుకొని, తర్వాత అందులో పాలకూర
పేస్ట్ కూడా వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు వేసి
బాగా మిక్స్ చేస్తూ వేగించాలి.
7. తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను
వేసి వేగిస్తూ మొత్తం మాసాలా, ఆకుకూర పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలా
ఉడికిస్తూ, వేగించుకోవలి. మూత పెట్టి, 10-15నిముషాలు, చికెన్ మొత్తగా అయ్యే
వరకూ వేగించుకోవాలి.
8. ఇప్పుడు పెరుగును బాగా గిలకొట్టి, పాన్ లో వేయాలి . బాగా మిక్స్ చేసి
మరో 2నిముషాలు వేగించుకోవాలి.
9. ఇప్పుడు అందులో ఉప్పు, ధనియాలపొడి వేసి మిక్స్ చేసి, కొద్దిగా నీళ్ళు
జోడించి, బాగా ఉడికించాలి . గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి. ఒక్కసారి
ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
10. తర్వాత తాజా క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి.
అంతే పాలర్ చికెన్ రెడీ రైస్ లేదా రోటీతో సర్వ్ చేయండి.

No comments:
Post a Comment