Wednesday, October 9, 2013

టాలీవుడ్ నటుడు శ్రీహరి కన్నుమూత

టాలీవుడ్ నటుడు శ్రీహరి కన్నుమూశారు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. రాంబో రాజ్ కుమార్ షూటింగ్ కోసం
ముంబై వెళ్లిన శ్రీహరి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ముంబై లోని లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. టాలీవుడ్ నటి డిస్కోశాంతిని వివాహం చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈయన మృతి చెందడం పట్ల పలువురు దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఈయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

1 comment:

  1. శ్రీహరి లాంటి విలక్షణ నటుడు దూరం కావడం బాధకరం. లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను

    ReplyDelete