మహిళలు గర్భధారణ పొండానికి, గర్భం పొందిన తర్వాత స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. హార్మోనుల హెచ్చుతగ్గుల మార్పులు సాధరణం. ఈ హార్మోనుల ప్రభావం వల్ల అనేక శరీరంలో అనేక మార్పులతో పాటు గర్భిణీ స్త్రీలో అనేక సందేహాలు కూడా మొదలవుతాయి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఎలా ఉండాలి. కడుపు పెరిగే బిడ్డ సంరక్షణ, ప్రసవం, ప్రసవం తర్వాత ఆరోగ్యం, ప్రీనేటల్ వెయిట్, పోస్ట్ నేటల్ వెయిట్ ఇలా అన్నింటిలోనూ సందేహాలు మెదలువుతాయి. అలాగే గర్భధారణ సమయంలో ఏర్పడే స్ట్రెచ్ మార్క్ తొలగింపు, చర్మం సంరక్షణ, జుట్టు సంరక్షణ అన్నింటి గురించి సందేహాలతో పాటు వాటికి పరిష్కార మార్గాలు వెదకడం మొదలు పెడుతారు. గర్భిణీ బ్యూటీ విషయంలో గర్భం పొందిన తర్వాత హార్మోనుల ప్రభావం చేత చాలా మంది మహిళలో జుట్టు, గోళ్ళు వేగంగా పెరగడం గమనించవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ విషయాన్ని గమనించినట్లైతే, ఆ కేశ సౌందర్యాన్ని అలాగే కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రసవం తర్వాత విటమిన్లు, క్యాల్షియం, ఐరన్ లోపం వల్ల తిరిగి జుట్టు రాలడం మొదలవుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో జుట్టు సంరక్షణ చాలా క్లిష్టమైనది. కాబట్టి గర్భధారణ సమయంలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు మీకోసం.... జుట్టుకు నూనె కంపల్సరీ: ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ తలకు తప్పని సరిగా నూనె రాయడం చాలా అవసరం. అంతే కాదు వారంలో ఒక మూడు సార్లు క్రమం తప్పకుండా నూనె అప్లై చేయాలి. మరియు హాట్ ఆయిల్ మసాజ్ కూడా గర్భిణీ స్త్రీలకు కొంత రిలాక్స్ ను మరియు జుట్టు ఆరోగ్యానికి పెరుగుదలకు సహాయపడుతుంది. కేశమూలాలకు బలాన్ని చేకూర్చుతుంది. హెయిర్ డైలక్ గుడ్ బై చెప్పండి: మీరు హెయిర్ డై లు కనుక ఉపయోగిస్తుంటే, గర్భధారణ సమయంలో హెయిర్ డైలకు నివారించండి. హెయిర్ డైలో ఉండే రసాయనాలు, ఆరోగ్యలక్షణాలను పెరగకుండా అడ్డుకుంటాయి. అయినా కూడా మీరు హెయిర్ డైలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటే కనుక నేచురల్ హెయిర్ డైలను ఎంపిక చేసుకోండి. గర్భధారణ సమయంలో ఖచ్చతంగా పాటించాల్సిన ఒక ముఖ్యమైన హెయిర్ కేర్ చిట్కా. హెడ్ మసాజ్ : మీలో అలసట, ఒత్తిడి వంటి అసౌకర్యమైన వాటిని దూరం చేయడానికి హెడ్ మసాజ్ బాగా సహాయపడుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. కాబట్టి మీఅంత మీరే అప్పుడప్పు ఒక చిన్న పాటి హెడ్ మసాజ్ చేసుకోండి. తడిగా ఉన్న జుట్టును దువ్వకండి: తడిగా ఉన్న జుట్టును ఎట్టిపరిస్థితుల్లోనూ దువ్వకూడద. గర్భధారణ సమయంలో హెయిర్ కేర్ తీసుకోవాలనుకొనేవారు, తడిగా ఉండే జుట్టును ఎప్పటికీ దువ్వకుండా తగుజాగ్రత్త తీసుకోవాలి. కేశాలు పూర్తిగా ఆరిన తర్వాత తలదువ్వుకోవాలి. మార్పులను చూసి సంతోషం చెందండి: ప్రెగ్నెన్సీ అంటే మార్పులు. మహిళల్లో పొడవాటి మరియు మందపాటి జుట్టును పొందవచ్చు అంతే కాదు, కర్లీ హెయిర్ కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి గర్భధారణ పీరియడ్ లో ఇటువంటి అద్భుతాలను చూసి ఎంజాయ్ చేయండి. అలాగే హెయిర్ స్టైల్ ను మార్చుకోవచ్చు. ఇదంతా ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకొనే హేయిర్ కేర్ వల్లనే సాధ్యం అవుతుంది. నేచురల్ పదార్థాలు: గర్భధారణ సమయంలో హెయిర్ కేర్ తీసుకొనేటప్పుడు, నేచురల్ పదార్థాలకంటే విలువైనవి మరేవీ ఉండవు. కాబట్టి మీ డైట్ లో అరటి పండ్లు, పుచ్చకాయలు వంటి వాటిన తప్పక చేర్చడం వల్ల మీ శరీరంకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ అందుతాయి. దాంతో మీ ఆరోగ్యానికి సరిపడా పోషకాలు అంది, జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి. హెయిర్ కట్ : హెయిర్ కేర్ లో హెయిర్ కట్ కూడా ప్రధానమే. గర్భధారణ సమయంలో జుట్టు పెరిగే కొద్ది, చిన్న చిన్న మార్పులు, హెయిర్ స్టైల్ చేసుకోవడానికి హెయిర్ కట్స్ వంటివి చేసుకోవచ్చు. జుట్టు చివర్లు ట్రిమ్ చేయడం వల్ల మీజుట్టు అందంగా పెరగడానికి ఒక మంచి మార్గం.

No comments:
Post a Comment