సర్వేంద్రియాణాం నయనం ప్రధానం - అన్నారు పెద్దలు. శరీరంలోని అన్ని అవయవాల్లోనూ కళ్ళకు ఇచ్చిన ప్రాధాన్యానికి అది గుర్తు. కానీ, ఇవాళ ప్రపంచ జనాభా సగటు జీవితకాలం పెరిగినా, వారిలో ఎక్కువ మంది దృష్టి
లోపం, అంధత్వం లాంటి తీవ్ర సమస్యలతో బాధపడుతున్నారు. పైగా, ప్రపంచంలోని నాలుగున్నర కోట్ల అంధుల్లో దాదాపు 80 శాతం మంది 50 ఏళ్ళ పైబడినవారే! వారిలోనూ దాదాపు 90 శాతం మంది తక్కువ ఆదాయంతో జీవనం సాగిస్తున్న వారే! ఈ పరిస్థితులన్నిటిపై దృష్టి సారించడానికి జరుపుతున్నదే - 'ప్రపంచ కంటిచూపు దినోత్సవం'.
'ప్రపంచ కంటిచూపు దినోత్సవం' అనేది అంధత్వం మీద, దృష్టి హీనత మీద అందరి ఆలోచనా పడేందుకు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. ప్రతి ఏటా అక్టోబర్ నెల రెండో గురువారాన్ని 'వరల్డ్ సైట్ డే'గా జరుపుకోవడం ఆనవాయితీ. ఓ ప్రత్యేకమైన రోజును ఈ అంశానికి కేటాయించడం ద్వారా కంటి చూపు, కంటిచూపును కాపాడుకొనే పద్ధతుల గురించి జనంలో చైతన్యం తీసుకురావడానికి వీలుంటుందని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ), అలాగే అంధత్వ నిరోధ అంతర్జాతీయ సంస్థ (ఐ.ఏ.పి.బి) కలసి ఈ ప్రపంచ కంటి చూపు దినానికి చేయాల్సిన కార్యక్రమాల్లో చురుకుగా పాలు పంచుకుంటూ ఉంటాయి. అలాగే, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు కూడా ఎన్నో ఏళ్ళుగా జనంలో చైతన్యం పెంచడానికి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని పాటిస్తున్నాయి.
ఇవాళ వృద్ధులకు, ప్రత్యేకించి మహిళలకు సరైన నేత్ర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లభించడం లేదు. వృద్ధాప్యం వల్ల అనేక ఇబ్బందులు, శుక్లాలు, రిఫ్రాక్టివ్ ఎర్రర్, గ్లాకోమో లాంటి సమస్యలు చివరకు అంధత్వానికి దారి తీస్తున్నాయి. నిజానికి, సరైన సమయంలో చర్యలు తీసుకుంటే ఈ సమస్యల్ని సులభంగా పరిష్కరించవచ్చు. అలా కాకుండా ఆలస్యం చేయడం వల్ల అవి అంధత్వం దాకా తీసుకువెళుతున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే తొలిసారిగా 1998 అక్టోబర్ 8 నాడు 'ప్రపంచ కంటి చూపు దినోత్సవం' జరిపారు. ఆ తరువాత దీన్ని ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన 'విజన్ 2020' కార్యక్రమంలో భాగం చేశారు.
ఈ దినోత్సవం జరుపుకోవడం వెనుక అనేక లక్ష్యాలున్నాయి. కంటి చూపు క్షీణించడం, అంధత్వమనేవి ప్రధానమైన అంతర్జాతీయ ప్రజారోగ్య సమస్యలుగా జనంలో చైతన్యం తేవడం అందులో మొదటిది. అలాగే, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాల్లో పాల్గొని, తగిన నిధులు కేటాయించేలా ప్రభుత్వాలను ప్రభావితం చేయడం రెండోది. అంధత్వ నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి జనాన్ని విద్యావంతుల్ని చేయడం మూడోది.
ఈ దినోత్సవం సందర్భంగా చెట్లు నాటడం, అంధత్వమనే ఇతివృత్తానికి తగ్గట్లు ఫోటోలు తీసి, అంతర్జాతీయంగా దృశ్యమాలిక రూపొందించడం లాంటివి చేస్తుంటారు. అలాగే, జనంలో చైతన్యం కలిగేలా ప్రదర్శనలు, కరపత్రాల పంపిణీ వగైరా కార్యక్రమాలు చేపడుతుంటారు. అనేక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, నేత్ర వైద్య సంఘాలు, సంస్థలు ఈ కృషిలో పాలుపంచుకొంటున్నాయి. ప్రపంచ కంటి చూపు దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనందరం కూడా దృష్టి లోపాల నివారణకు చేతనైనంత కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం!

No comments:
Post a Comment