సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఓ ప్రతేకతను సంపాధించుకున్న నటి 'మంచు లక్ష్మీ'. ఒకవైపు వైవిధ్య భరిత పాత్రల్లో నటిస్తూనే.. మరో వైపు నిర్మాతగా తన సత్తా చాటుతోంది. ఇలా టాలీవుడ్ లో
దూసుకుపోతున్న 'లక్ష్మీ ప్రసన్న' ఈ మంగళవారం తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె '10టివి'తో ప్రత్యేకంగా మాట్లాడారు.. . '' తెలుగు ఇండస్ట్రీలో నన్ను బాగా ఆదరిస్తున్నారు. తమ ఫ్యామిలీపై అభిమానులు చూపిస్తున్న ప్రేమలు, ఆప్యాయతలకి మేము రుణపడి ఉంటాము. మమ్మల్నీ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఎప్పుడూ..ఇలానే ఆదరిస్తూ.. మా విజయానికి తోడవ్వాలని కోరుకుంటున్నాను, మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి మేము ఎప్పుడూ.. సిద్ధంగానే ఉంటాం'' అన్నారు. సో అక్టోబర్ 8న పుట్టిన రోజు జరుపుకుంటున్న లక్ష్మీ ప్రసన్నకు మనమూ విషెస్ చెబుదాం.. 
No comments:
Post a Comment