'విద్యా బాలన్'.. బాలీవుడ్ నటిగా.. ఐటమ్ భామగా ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్. 'డర్టీ పిక్చర్'సినిమాలో అద్భుతంగా నటించి నేషనల్ అవార్డ్ సాధించింది. పాత్ర పరంగా ఎక్స్ పోజింగ్ ఓవర్ గా ఉన్నా..
విద్యాబాలన్ ఆ తరహా పాత్రలకు కొత్త కాబట్టి ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. అయితే వెంటనే అలాంటి పాత్రలే చేయకుండా 'కహానీ' లాంటి కాంప్లికేటెడ్ పాత్రలోనూ రాణించి, వందకోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ లో ఓ హీరోయిన్ నటించిన రెండు సినిమాలు వంద కోట్లు సాధించిన ఘనత విద్యా బాలన్ దే.. 'కహానీ' సినిమా తర్వాత పెళ్లి చేసుకున్న విద్య.. స్పీడ్ తగ్గిపోయింది. మధ్యలో ఘన్ చక్కర్ అంటూ వచ్చినా అది ఫ్లాప్ అయింది. దీంతో ఇప్పుడు విద్య ఏం చేస్తోందనే ప్రశ్న చాలామందిలో కలుగుతుంది. కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలేమీ లేవు. సినిమా ఫంక్షన్లలోనూ పెద్దగా కనిపించడం లేదు. మరి ఇలాంటి ఉంటే ఆడియన్స్ మర్చిపోరూ.. అంటారా..? అందుకే లేటెస్ట్ గా ఫోటో షూట్ చేసి రేసులోనే ఉన్నానని చెప్పింది. ఏ ఫోటో షూట్ లో ఏ ఆఫర్ ఉందో ఎవరు చెప్పగలరు.. మరి ఆఫర్ లేక కనిపించకుండా పోతుందా..? అనే అనుమానాలు వస్తుంది.. సినీ ప్రియులకు. మరి విద్యా మళ్లీ సినిమాలు తీస్తుందా..?లేదా..? అనేది చూడాలి. 
No comments:
Post a Comment