Wednesday, October 16, 2013

రాడిక్యులర్‌, స్పైనల్‌ సింపథెటిక్‌, వెటెబ్రల్‌ ఆర్టెరీ....

మధ్య వయస్సు వాళ్ళలో, పెద్దవారిలో, స్పాండిలోసిస్‌ ఒక సాధారణమైన సమస్య. రాడిక్యులర్‌, స్పైనల్‌ సింపథెటిక్‌, వెటెబ్రల్‌ ఆర్టెరీ అనే నాలుగు విధాలైన స్పాండిలోసిస్‌లు ఉంటాయి. నరాలు లేదా రక్తనాళాలు ఒత్తిడికి గురైనప్పుడు లేక వెన్నెముక మధ్యనున్న డిస్క్‌లు స్థానభ్రంశం చెందినప్పుడు, మెడ, భుజాలు, చేతిపై భాగంలో నొప్పిగా, మంటగా, అక్కడ మొద్దుబారినట్టుగా అనిపించడం స్పాండిలోసిస్‌ లక్షణాలు. సమస్య తీవ్రమైతే అవయవాలకు పక్షవాతం రావడం, స్వాధీనం కోల్పోవడం, వర్టిగో లాంటి సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. దీన్ని చైనీస్‌ మెడికల్‌ కేటగిరీలో బై డిజార్డర్స్‌ అంటారు. వీరి ప్రకారం, చెడు చల్లదనం, చెడు గాలి వలన 'కి' (ప్రాకృతిక శక్తి) ఆగిపోతుంది. దీనివలన రక్తం, మాట, శక్తి వాహకాలు అన్నింటికీ అవరోధం ఏర్పడుతుంది. ఈ సమస్యకు చాలా కేసుల్లో ఆపరేషన్ల కంటే నాన్‌ సర్జికల్‌ చికిత్సను వీరు సూచిస్తున్నారు. అటువంటి నాన్‌ సర్జికల్‌ చికిత్సలలో ఆకుపంక్చర్‌ ఒకటి.
చైనా సంప్రదాయ వైద్య విధానాలలో ఆక్యుపంక్చర్‌ వైద్య విధానానికి చాలా ప్రాశస్త్యం ఉంది. దీనిని భారతీయ ప్రాచీన వైద్యవిధానం అని కూడా అంటారు. బాడీ ఆక్యుపంక్చర్‌ వైద్య విధానంలో సూదులతో చికిత్స చేస్తారు. మన దేహంలో 12 శక్తి పథాలు ఉంటే, అందులో 365కి పైగా బిందు కేంద్రాలు ఉన్నట్టు శాస్త్రం చెబుతోంది. శస్త్ర చికిత్స చేయడం వలన, నొప్పులు కలిగినపుడు శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగి, దేహంలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ఈ అసమతౌల్యాన్ని నివారించడానికి కొన్ని నిర్దిష్ట ప్రదేశాలలో సూదులు పొడుస్తారు. అలా చేసి శక్తిని సరైన మార్గంలోనికి వెళ్ళేట్టు చేస్తారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం యొక్క అంచనా ప్రకారం ఆక్యుపంక్చర్‌ బాధ కలిగించే స్పందనలను మెదడుకు వెళ్ళకుండా అడ్డుకోవడమే కాదు శరీరంలోనే బాధానివారణ రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. స్పాండిలోసిస్‌ చికిత్సలో గుచ్చిన సూదులను 30 నిముషాల వరకు ఉంచుతారు. చైనా అకాడమీ ఆఫ్‌ టిసీఎమ్‌, ఆక్యుపంక్చర్‌ చికిత్స జరిపిన 250 కేస్‌ స్టడీస్‌పై అధ్యయనం చేసింది. మెడ , భుజాల నొప్పులను 97.6 శాతం మందికి తగ్గించినట్టు ఫలితాలు చెబుతున్నాయి. మొద్దుబారినట్టుగా ఉండే లక్షణం 89.54 శాతం మందిలో తగ్గింది.
రక్త శుద్ధి
రక్త శుద్ధి చేయడానికి రెండురకాలైన విధానాలను ఆక్యుపంక్చర్‌ వైద్య విధానంలో అనుసరిస్తారు. అవి, బ్లీడింగ్‌ అండ్‌ కప్పింగ్‌ మరియు ప్లమ్‌ బ్లాసమ్‌ ఆక్యుపంక్చర్‌. ఈ విధానాలను ఉపయోగించి రక్త నాళాలలోని అవరోధాలను తొలగిస్తారు. టిసిఎమ్‌ చేసిన అధ్యయనంలో 38 మందికి ఈ చికిత్స జరిగితే 23 మంది స్వాంతన పొందారు. 14 మందిలో చాలా బాగా గుణం చూపించింది. కేవలం ఒకరు మాత్రం ఏమీ గుణం చూపలేదన్నారు.
మోక్సిబషన్‌ ఆక్యుపంక్చర్‌
ఈ పద్ధతిలో ఆక్యుపంక్చర్‌ కోసం నిర్ణయించిన ప్రదేశంలో, ఆక్యుపంక్చర్‌ చేయడానికి ముందు సూదికి 'మోక్సా' అనే పదార్థాన్ని పూసిన తర్వాతనే గుచ్చుతారు. ఈ చికిత్సా విధానం వలన 22 మందికి చికిత్స చేస్తే ఏడుగురికి ప్రభావం చూపింది. ఎక్కువ మందికి మధ్యస్థంగా ఫలితాలు వచ్చాయి.
ఇయర్‌ ఆకుపంక్చర్‌
ఆక్యుపంక్చర్‌లో, చెవిలో ముఖ్యమైన పాయింట్స్‌ను లివర్‌, కిడ్నీ, మెడ కోసం ఉపయోగిస్తారు. అందులో కొన్ని ఉప భాగాలను ఎండోక్రైన్‌, సింపథెటిక్‌, స్పైన్‌, షెన్‌మెన్‌, హార్ట్‌, టైయాంగ్‌, ఆక్సిపుట్‌, భుజాలలోని అనారోగ్యాల చికిత్స కోసం మార్క్‌ చేస్తారు. చెవిని అంటిపెట్టి ఉంచే సూదులను 10 లేక 15 రోజుల వరకూ ఉంచేస్తారు. ఈ చికిత్సా విధానంలో 51 మందికి చికిత్స చేస్తే 30 మందిలో ఆరోగ్యం కుదుట పడింది. చెప్పుకో తగినంతగా 18 మందిలో ఫలితం కనబడింది.
ప్రస్తుతం ఆక్యుపంక్చర్‌, ఎలక్ట్రో ఆక్యుపంక్చర్‌, ఇయర్‌ ఆక్యుపంక్చర్‌ ఇలా అన్నిరకాలైన విధానాలను కలిపి, ఒక సమగ్రమైన చికిత్సా విధానం అనుసరిస్తున్నారు. దానివలన మెరుగైన ఫలితాలు ఉంటున్నాయి. ఏఏ విధానాలను కాంబినేషన్‌గా చేసి, చికిత్సను అందివ్వాలనేది పేషంట్‌ను బట్టి నిర్ణయిస్తారు.

1 comment:

  1. Radicular and vertebral arteries are blood vessels and spinal sympathetics are nerves. These have nothing to do with spondylitis, which is an arthritic process.
    Sympathetic nerves are located in the mid back , no way related to neck.
    Check the facts and post please.

    ReplyDelete