'రామయ్యా వస్తావయ్యా'.. బాక్సాఫీసు ముందు బోల్తా పడడంతో ఎన్టీఆర్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయాడు. ప్రస్తుతం ఉన్న రేసులో నిలవాలంటే ఖచ్చితంగా ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన పరిస్థితిలో పడ్డాడు. అయితే హిట్
ఇవ్వాలన్న కంగారులో ఎంచుకునే సబ్జెక్ట్స్ విషయంలో రాంగ్ స్టెప్స్ వేస్తున్నాడు. ఓ సినిమా సబ్జెక్ట్ ఎంచుకోవడమంటే స్టెప్ వేసినంత ఈజీ కాదని తెలుసుకున్నా.. మళ్లీ అవే మిస్టేక్స్ చేస్తున్నాడట. ప్రస్తుతం 'రభస' చేస్తున్న యంగ్ టైగర్ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో సినిమాకు ఓకే చెప్పాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్టోరీ లింగుస్వామి ముందుగా మహేష్ కు చెప్పాడు. అతను కాదనడంతో ఎన్టీఆర్ కు చెప్పాడట. మరోవైపు ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్ధమైన కొరటాల శివ అర్థాంతరంగా డ్రాప్ అయ్యాడనే న్యూస్ వినిపిస్తోంది. ఎందుకంటే గతంలో శివ, గతంలో మహేష్ కు కథ వినిపించాడు. అప్పుడు తేల్చని మహేష్ లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశాడని టాక్. దీంతో వెంటనే ఎన్టీఆర్ కు శివ హ్యాండిచ్చాడని సమాచారం. అసలే కష్టాల్లో ఉన్న తనకు కొరటాల శివ షాక్ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. మరి ఈ బుడ్డోడి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

No comments:
Post a Comment