పేరెంటింగ్ అనేది నిజానికి ఒక కళ. ఆ కళలో తల్లితండ్రులు నిష్ణాతులవ్వాలి. అప్పుడే తల్లితండ్రు లకి, పిల్లలకి మధ్య ఒక గట్టి బంధం బలపడు తుంది. జనరేషన్ గ్యాప్ తగ్గుతుంది. పిల్లలకు ఎంత దగ్గరవ్వాలి?
ఎంత స్వేచ్ఛనివ్వాలి? ఎప్పుడు స్నేహంగా ఉండాలి? ఏ సమయంలో దండిం చాలి? అనే విషయాల మీద పూర్తి పట్టు ఉండాలి. ఆ క్రమంలో పేరెంటింగ్ గురించి కొన్ని టిప్స్.
వారి వయస్సుతో సంబంధం లేదు. ఏ వయస్సు పిల్లలైనా సరే తరచూ మీ ప్రేమను చేతల్లోనే కాదు మాటల్లో కూడా చెప్పాలి. పిల్లలను దగ్గరకు తీసుకోవాలి. అలా చేయడం వలన వాళ్ళు ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. మీరున్నారనే ధైర్యంతో నిశ్చింతగా ఉంటారు.
విశ్వసించండి
వీలైనప్పుడల్లా మీకు పిల్లల మీద ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలియచేయండి. తోటి పిల్లలు చెప్పిన మాటలు విని, కించపరచకుండా ఏం జరిగిందో అడిగి తెలుసుకుని తప్పు ఉంటే సవరించండి. పిల్లలను ఎప్పుడూ అనుమానించ కూడదు. ఆ నమ్మకం వారిపై ఉంచితే తప్పు చేయడానికి పిల్లలు తప్పకుండా వెనకాడతారు.
ఒక కోడ్ వర్డ్
మీకు, వారికి మాత్రమే అర్థమయ్యేలా, వారిలోని సద్గుణాలను తెలియచేసే విధంగా ఒక పేరు పెట్టి పిలవండి. అది మీకూ వాళ్ళకూ మధ్య అనుబంధం పెంపొందేలా చేస్తుంది.
నిద్రకు ముందు
చిన్న పిల్లలకైతే, రోజూ పడుకునే ముందు కథల పుస్తకం చదివి వినిపించడమో, చెప్పడమో చేయాలి. వాళ్ళు చాలా సంతోషపడతారు. కథలు చెప్పడం వలన వాళ్ళలో ఊహాశక్తి పెరుగుతుంది.అలా అని టీనేజ్ పిల్లల్ని నిర్లక్ష్యం చేయాలని కాదు. ఆ వయస్సులో వాళ్ళు పెద్దవుతున్న చిన్నపిల్లలు. వాళ్ళకూ వాళ్ళ తల్లితండ్రులు తమని చిన్నపిల్లల్లానే ముద్దు చేయాలని ఆశిస్తారు. వాళ్ళు నిద్రపోయే ముందు వెళ్ళి, వాళ్ళకు నచ్చే విధంగా గుడ్‌నైట్ చెప్పాలి.
సహాయం చేయనివ్వండి
సాధారణంగా పెద్దవాళ్ళు పిల్లలకు పనులు చెప్పడం ఇష్టపడరు. మనం ఉండగా పిల్లలు ఎందుకు సహాయం చేయాలనుకుంటారు. కానీ, పిల్లలను కూడా చిన్న చిన్న పనుల్లో సహాయం చేయనివ్వాలి. బ్యాగ్‌లో నుండి సరుకులు బయటకు తీయడం, తెచ్చిన కూరగాయలు ఫ్రిజ్‌లో పెట్టడం లాంటి పనులు చెప్పడం వలన వారు బాధ్యతాయుతంగా మెలగడం నేర్చుకుంటారు.
పిల్లలతో ఆడండి
పిల్లలతో పిల్లలైపోయి వారు బొమ్మలతో ఆడుకుంటున్న ప్పుడు మీరూ ఉండి, వారితో సమయం వెచ్చిస్తే పిల్లలు చాలా ఆనందిస్తారు. అదే పెద్ద పిల్లలతో ఛెస్, క్యారమ్స్, లూడో వంటి ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్ లాంటి ఔట్‌డోర్ గేమ్స్ ఆడితే వాళ్ళు మిమ్మల్నీ వారితో కలుపుకుంటారు. పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పాలి. స్కూల్, కాలేజ్ విశేషాలు అడిగి తెలుసుకోవాలి. వాళ్ళు ఏదైనా ఆసక్తిగా చెప్తున్నప్పుడు మధ్యలో ఆపడం కానీ, ఇక చాల్లే ఆపు అంటూ విసుక్కోవడం కానీ చేయకూడదు. సహనంగా వినాలి.చిన్నపిల్లలు అయితే వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇవ్వాలి. అలా చేస్తే వారిలో కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్న ఉత్సుకత పెరిగి, సృజనాత్మకంగా ఆలోచించే శక్తి పెంపొందుతుంది. వారు మాటకు విలువ ఉందని అర్థంచేసుకుని ఆత్మవిశ్వాసంతో పిల్లలు పెరుగుతారు.
కలిసి భోంచేయండి
కుటుంబసభ్యులు అందరూ కలసి, భోజనం చేయాలి. అలా చేస్తే అందరితో పాటు కూర్చుని భోజనం చేయడంలోని ఆనందం పొందడమేకాక, కుటుంబం మీద ప్రేమ, గౌరవం తో పెరుగుతారు. నలుగురిని కలుపుకుపోవడం, కలిసి మెలిసి మసలడం నేర్చుకుంటారు.అంతేకాదు షేర్ చేసుకుని తినడం అలవాటు చేసుకుంటారు.

.jpg)
No comments:
Post a Comment