Saturday, October 5, 2013

'పక్క ఇండస్ట్రీనా.. అయితే ఓకే'!


ఒక సినిమా హిట్ .. ఫ్లాప్ అనేది ఎవరి చేతిలో ఉండదని అంటోంది తెలుగు ముద్దుగుమ్మ 'స్వాతి'. ఆమె శుక్రవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో భాగంగా... మీడియాతో మాట్లాడుతూ.. తమ అభిప్రాయాన్ని పంచుకుంది. 'సినిమా హిట్ అనేది యాక్టర్స్ చేతిలో ఉండదు. కెరీర్ ఎప్పుడు హ్యాపీగా నడుస్తుందో.. తెలియదు. 'ఫ్రైడే టు ప్రైడే'కు సీన్ మారిపోతుంది. అయితే మన ఇండస్ట్రీలో పర భాష హీరోయిన్లకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. టాలెంట్ తో సంబంధం లేకుండా.. ఇతర ఇండస్ట్రీ అయితే వెంటనే తీసుకుంటున్నారు. ఇది కేవలం మన ఇండస్ట్రీలోనే కాను ఇతర వుడ్ లలోనూ ఉంది.
ఒకరకంగా చెప్పాలంటే.. ఈ సంవత్సరం నాకు బాగా కలిసొచ్చింది. మలయాళంలో రెండు సినిమాలు చేశాను. 'స్వామిరారా' సినిమాకు కూడా మంచి స్పందన వస్తుంది'' అని అన్నారు.

No comments:

Post a Comment