
వయస్సు పెరగడం ప్రకృతిసిద్ధంగా జరిగిపోతుంది కాబట్టి దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కాని వయస్సు పెరగకుండా ఆగిపోయినట్టు చేయడం మన చేతుల్లోనే
ఉంది అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా అసలు వయసుపెరిగే ప్రక్రియనే నెమ్మది చేయవచ్చునంటున్నారు కూడా. వయస్సును ధిక్కరించగల చికిత్సల గురించి తెలుసుకొనే ముందు అసలు మనలో వయస్సు పెరుగుతున్న జాడలు ఎలాబైటపడతాయన్నది చూద్దాం. శరీర బరువు, ఎండలో మాడడం, , రోజువారీ ఒత్తిడులు మన ఆకృతిపై కొన్ని గుర్తులను విడిచిపెడతాయి. ముఖంపై చర్మం వదులవడం, కళ్లకింద చారికలు, చర్మంసాగి వ్రేలాడ్డం, దవడ చుట్టూ, మెడపై చర్మం ముడతలు తేలడం వలన మనం మన వయస్సు కంటె ఎక్కువ కనపడతాం. వయస్సు కనపడకుండా చేసే క్రీములవలన ఉపయోగం ఉందా అంటే పరిస్థితిని ఐదు నుంచి 10 శాతం మెరుగుపరచగలవని చెప్పవచ్చు. ఐతే వాటిని పులుముకొనడం మానేసిన రోజున వాటి ప్రభావం పూర్తిగా మాయమవుతుంది. అదే వాటితో వచ్చిన చిక్కు. వయస్సు మీదపడే ప్రక్రియను పూర్తిగా ఆపుచేయలేకపోయినా, దీన్ని అదుపుచేయవచ్చు, వెనక్కి మళ్లించవచ్చు కూడా అంటున్నారు నిపుణులు. పూర్వం ఇందుకు శస్త్ర చికిత్స ద్వారా ముఖాన్ని సరిచేయడానికి తాడు చికిత్స మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఇ2 లేజర్ ఫేస్ లిఫ్టు అందుబాటులో ఉంది. దీనిద్వారా శస్త్ర చికిత్స లేకుండా ముఖాన్ని మెరుగుపరచవచ్చు.ఇ2 లేజర్ ఫేస్ లిఫ్టు
ఇది వయస్సు మీదపడే ప్రక్రియను వెనుకకు మళ్లిస్తుంది. ఈ పని నెమ్మదిగా, క్రమేణా, చడీ చప్పుడూ లేకుండా జరుగుతుంది. చర్మాన్ని మెరుగుపరిచి, లోపలి కణజాలాన్ని కొల్లేజెన్ ఉత్పత్తికి ప్రేరేపించడం ద్వారా ముఖం, మెడలను ముడతలు కనపడకుండా సరిచేయవచ్చు. రెంటినీ మరింతగా యవ్వనంలో ఉన్నట్టు కనిపింపచేయవచ్చు. బాగా సాగదీసినట్లుగాని, బిగదీసినట్లు గాని చేయకుండా ఇది సాధించవచ్చు. శస్త్ర చికిత్సలో బిగదీసినట్లు లేదా వదులయినట్లు కొంతకాలానికి కనిపించే ప్రమాదముంది. లేజర్ చికిత్స మొదలుపెట్టిన తొలిరోజు నుంచి ఆరునెలల లోగా క్రమేణా ఆకారం మెరుగవుతుంది. నెలకు ఈ చికిత్సకు నాలుగు లేదా ఐదు సెషన్స్ అవసరపడతాయి. ప్రతి ఒక్క సెషన్‌కు మెరుగుదల కనపడుతుంది. తక్షణమే వారు మామూలు రోజువారీ పనులు చేసుకోవచ్చు. ఇ2 ఫేస్ లిఫ్టుకి ' లంచ్ టైమ్ ఫేస్ లిఫ్టు' అను ముద్దు పేరు.
No comments:
Post a Comment