Thursday, October 3, 2013

'దూసుకెళ్తా'కు సెన్సార్ దెబ్బ!

మంచు విష్ణు' హీరోగా తండ్రి డా. మోహన్ బాబు నిర్మించిన 'దూసుకెళ్తా' చిత్రానికి 'సెన్సార్' షాక్ తగిలింది. ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల సెన్సార్ కు పంపగా, అందులో కొన్ని అభ్యంతరకర పదాలున్నాయని దాని వల్ల సినిమాకు 'U' సర్టిఫికేట్ ఇవ్వలేమన్నారట. దీనిని సెన్సార్ అధికారి ధనలక్ష్మి తిరస్కరించినట్లు సమాచారం. గతంలో ధనలక్ష్మి సెన్సార్ చేసిన పలు చిత్రాలలో ఇలాంటి పదాలు విరివిగా ఉపయోగించారని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు తమ సినిమాకే ఎందుకు వచ్చిందని మోహన్ బాబు సెన్సార్ సభ్యుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
దీనిపై తమకు సెన్సార్ అధికారి నుంచి సరైన సమాధానం లభించలేదట. దాంతో, తెలుగు సినిమా పరిశ్రమలో తొలిసారిగా ఒక ట్రైలర్ ను రివైజింగ్ కమిటీకి పంపడం అన్నది తమ 'దూసుకెళ్తా' చిత్రం విషయంలోనే జరిగిందని విష్ణు చెబుతున్నాడు. గతంలో మంచు విష్ణు నటించిన 'దేనికైనా రెడీ' సినిమా విషయంలో కూడా ధనలక్ష్మి తమను సెన్సార్ పరంగా ఇబ్బందులకు గురిచేశారని ఈ సినిమా యూనిట్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా.. వీరుపోట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. మరి ఇలాంటి పరిస్థితులో 'దూసుకెళ్తా' సినిమా విడుదలవుతుందా..? లేదా..? అన్నది సస్పెన్స్ గా మారింది.


No comments:

Post a Comment