Wednesday, October 2, 2013

లక్కీగాళ్ గా టాక్ తెచ్చుకున్న 'నిత్యామీనన్'

లక్కీగాళ్ గా టాక్ తెచ్చుకున్న 'నిత్యామీనన్' 'శర్వానంద్'తో జత కడుతోంది. దీనితో తన లైఫ్ టర్నింగ్ తిరుగుతుందని 'శర్వానంద్' భావిస్తున్నాడంట. కోలీవుడ్ లో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న 'చరణ్' ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. క్యూట్ లవ్ స్టోరీగా చెబుతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం ఫేస్ బుక్ పై సాగే ఓ పాట చిత్రీకరిస్తున్నారట. ఈ పాట కోసం 25లక్షలతో ఫేస్ బుక్ సెట్ వేశారట. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీలో ఈ పాట హైలెట్ గానూ స్పెషల్ గానూ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. జి.వి. ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న సినిమా పై అంచనాలు భారీగా లేకపోయినా ఖచ్చితంగా ఆడియన్స్ కు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నారు. స్రవంతి రవికిశోర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స్నేహ, ప్రకాష్ రాజ్, సంతానం, జయప్రకాష్ రెడ్డి లాంటి స్టార్లు కూడా ఉన్నారు. మరి ఈ సినిమాతో లక్కీ గాళ్ నిత్యమీనన్, శర్వానంద్ కు ఎలాంటి లైఫ్ ని ఇస్తుందో వేచి చూడాలి.

No comments:

Post a Comment